
'మహిళలు జీన్స్ వేసుకోవడం వల్లే భూకంపాలు'
భూకంపాలు ఎందుకు వస్తాయన్నది శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. భూమి పొరల్లోపల జరిగే మార్పుల కారణంగానని వాళ్లు అంటుంటే.. పాకిస్థాన్లోని ఓ ఉగ్రవాద నాయకుడు మాత్రం అబ్బే అది కాదంటున్నారు. మహిళలు జీన్సు ప్యాంట్లు వేసుకోవడం వల్లే ద్రవ్యోల్బణం దగ్గర నుంచి భూకంపాల వరకు వస్తున్నాయని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ అన్నారు.
పాకిస్థాన్ వ్యాప్తంగా జీన్సు ప్యాంట్లు వేసుకునే మహిళలపై సైనిక ఆపరేషన్ ప్రారంభించాలని పాక్ సైన్యాన్ని కోరారు. ఇస్లామాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీమాట చెప్పారు. తాలిబన్లు పాకిస్థాన్కు శత్రువులు కారని, అందువల్ల తెహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ మీద సైనిక ఆపరేషన్ చేయడం అనవసరమని ఆయన చెప్పారు.