'హిమాలయాల్లో భూకంపం వస్తే...'
'హిమాలయాల్లో భూకంపం వస్తే...'
Published Sun, Oct 6 2013 1:22 PM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
ఒకవేళ హిమాలయ పర్వత శిఖరాల్లో సంభవించే భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 8 పాయింట్లు నమోదైతే కనుక సుమారు ఎనిమిది లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి హెచ్చరించారు.
హిమాలయ పర్వశ్రేణులకు ఆనుకుని ఉండే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గత 53 సంవత్సరాల్లో భూకంప తీవ్రత చాలా ఉధృతంగా ఉన్నట్టు సూచనలు అందుతున్నాయని శశిధర్ రెడ్డి తెలిపారు. భూకంప తీవ్రత 8 పాయింట్లకు మించితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. 1950 నుంచి అలాంటి ప్రమాదాన్ని ఇప్పటి వరకు ఎదుర్కోలేదన్నారు.
అయితే హియాలయ పర్వత ప్రాంతాల్లో అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. భూకంప తీవ్రత 8 పాయింట్లకు మించి ఉన్నట్టయితే భారీగా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండిలో భూకంపం సంభవిస్తే చండిఘర్ లో 20 వేల మంది ప్రాణలకు ముప్పు ఏర్పడుతుందని శశిధర్ రెడ్డి హెచ్చరించారు.
Advertisement
Advertisement