
సోషల్ మీడియాలో పార్టీల వ్యయంపైనా నిఘా!
కోల్‌కతా: ఎన్నికల కమిషన్ మొట్టమొదటిసారిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సోషల్ మీడియూ ద్వారా చేసే వ్యయంపై కూడా నిఘా వేయనుంది. వికీపీడియూ, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక సంబంధాల వెబ్‌సెట్ల ద్వారా చేసే ఖర్చును ఈసీ పర్యవేక్షించనుంది. పెరుుడ్ న్యూస్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చర్యలను కట్టుదిట్టం చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థారుు పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు కానున్నట్టు కోల్‌కతాలో జరిగిన ఓ మీడియూ వర్క్‌షాప్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
రాజకీయ పార్టీలు చేసే వ్యయంపై దృష్టి పెట్టేందుకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియూలో వచ్చే పెరుుడ్ న్యూస్‌ను తనిఖీ చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థారుు మీడియూ ధ్రువీకరణ (సర్టిఫికేషన్), పర్యవేక్షణ కమిటీలను ఈసీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మీడియూ సర్టిఫికేషన్ సంబంధిత వివాదాల పరిష్కారానికి రాష్ట్ర స్థారుు అప్పిలేట్ కమిటీ పనిచేస్తుందన్నారు. మీడియూ స్వీయ నియంత్రణ విధించుకుని ఎన్నికల వార్తల ప్రచురణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.