యమెన్ రాజధాని సనాలో మంగళవారం ఉదయం మిలటరీ బస్సులో బాంబు పేలుడు సంభవించింది.
యమెన్ రాజధాని సనాలో మంగళవారం ఉదయం మిలటరీ బస్సులో బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఇద్దరు సైనికులు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. దర్ స్లిమ్ జిల్లాలో బస్సు ప్రయాణిస్తుండగా ఆ ఘటన చోటు చేసుకుందన్నారు. అయితే బస్సులో బాంబు పేలుడా, రోడ్డు పక్కనున్న పేలుడా, ఆత్మాహుతి దాడా అనే విషయం తెలపలసి ఉందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గతేడాది ఆగస్టులో వైమానిక దళ ఉద్యోగులతో ప్రయాణిస్తున్న ఒస్సులో బాంబు పేలుడు సంభవించి ముగ్గురు మరణించగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడిన సంగతిని వారు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అరబ్ దేశంలో యమెన్ అత్యంత పేద దేశం. ఆ దేశంలో ప్రముఖ తీవ్రవాద అల్ ఖైదా తనది పైచేయి సాధించేందుకు యత్నిస్తుంది. అందులోభాగంగా భద్రత దళాలు, సైనికులపై దాడులకు తెగబడుతుంది.