ఫేస్బుక్ కీలక నియామకం
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ తన వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా మరో కీలక ముందడుగు వేసింది.దేశంలో వ్యాపార విస్తరణపై కన్నేసిన ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ..ఈ ఏడాది జూలై లో ఒక బిలియన్ యూజర్లను అధిగమించిన మెసెంజర్ కోసం కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రధాన యాప్ మెసెంజర్ కోసం కొత్త నియామకాన్ని చేపట్టారు.
మాజీ యాహూ అధికారి, ప్రముఖ ఈ టెయిలర్ స్నాప్ డీల్ కు ముఖ్య ఉత్పత్తి అధికారి గా పనిచేసిన ఆనంద్ చంద్రశేఖరన్ ను మెసెంజర్ యాప్ కు అధికారిగా నియమించారు. ఈ విషయాన్ని మంగళవారం చంద్రశేఖరన్ తన అధికారిక ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. ఫేస్బుక్ మెసెంజర్ వేదికపై పనిచేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కాగా కనెక్టింగ్ ఇండియా తమ ప్రధాన లక్ష్యమని ,దేశంలో బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలకు ఇంటర్నెట్ యాక్సెస్ లేదనీ, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని జుకర్ బర్గ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.