2016లో టాప్ యాప్ లు ఇవే!
న్యూఢిల్లీ: 2016లో టాప్ 3 యాప్‌లుగా ఫేస్‌బుక్, వాట్సాప్, యూసీ బ్రౌజర్‌లు.. టాప్ 3 గేమ్‌లుగా క్యాండీ క్రష్, సబ్‌వే సర్ఫర్స్, టెంపుల్ రన్–2లు నిలిచాయి. గతేడాదికి సంబంధించి ఆండ్రాయిడ్ యాప్‌ల డౌన్‌లోడ్‌లలో అమెరికాను భారత్ మించిపోయింది. 2016లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారత్‌లో ఆరు బిలియన్ల డౌన్‌లోడ్‌లు నమోదయ్యాయి.
గత సంవత్సరంలో ప్లే స్టోర్, ఐఓఎస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌ల సంఖ్య 15 శాతం, వాటిపై గడిపే సమయం 25 శాతం పెరిగాయని ‘యాప్ ఆన్నీ’అనే సంస్థ తెలిపింది. యాప్‌ల డౌన్‌లోడ్‌ల ద్వారా పబ్లిషర్లకు 35 బిలియన్ డాలర్ల ఆదాయం లభించిందని, యాప్‌లు వాడుతున్నప్పుడు వచ్చే ప్రకటనల ద్వారా సమకూరిన ఆదాయాన్ని కూడా కలిపితే ఇది 89 బిలియన్ డాలర్లని యాప్ ఆన్నీ పేర్కొంది.