న్యూఢిల్లీ: యూరియా పెట్టుబడి విధానంలోని ‘తిరిగి కొనుగోలు హామీ నిబంధన’ను తొలగిం చేందుకు ఎరువుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ఒక ప్రతిపాదనను కూడా పంపింది. దీని స్థానంలో కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేసి, బిడ్డింగ్ తరహాలో కొత్త విధానాన్ని అమలుచేయాలని ప్రతిపాదించింది. దేశంలో యూరియా ఉత్పత్తిని పెంచడానికి, కంపెనీలను ప్రోతహించేందుకు వీలుగా 2012 జనవరిలో ఎరువుల మంత్రిత్వ శాఖ కొత్త పెట్టుబడి విధానాన్ని రూపొందించింది. దీన్ని అదే ఏడాది డిసెంబర్‌లో కేంద్రం ఆమోదించింది. ఈ విధానం ప్రకారం దేశంలో కంపెనీలు ఉత్పత్తి చేసే యూరియాను కేంద్రం తప్పనిసరిగా ఎనిమిదేళ్లపాటు కొనాలి. దీనికి అనుగుణంగా 13 ఎరువుల సంస్థలు ఉత్పత్తిని భారీగా పెంచేం దుకు, కొత్త ప్లాంట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దశలో ఎరువుల మంత్రిత్వ శాఖ ‘తిరిగి కొనుగోలు హామీ నిబంధన’ను తొలగించాలని ప్రతిపాదనలు పం పింది. అలాగే, దరఖాస్తు చేసుకున్న 13 కంపెనీల నుంచి 3 లేదా 4 కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేసి బిడ్డింగ్‌కు ఆహ్వానించాలని సూచించింది.
‘యూరియా’ నిబంధనలపై వెనక్కి!
Published Mon, Nov 11 2013 3:06 AM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM
Advertisement