కొత్త ఇంటికి మారిన అరవింద్ కేజ్రీవాల్ | Finally Arvind Kejriwal moves into Delhi house | Sakshi
Sakshi News home page

కొత్త ఇంటికి మారిన అరవింద్ కేజ్రీవాల్

Published Sat, Feb 1 2014 8:32 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

కొత్త ఇంటికి మారిన అరవింద్ కేజ్రీవాల్ - Sakshi

కొత్త ఇంటికి మారిన అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ:  ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు కొత్త ఇంటికి చేరుకున్నారు. నగరంలో  ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసానికి శనివారం నాడు మారారు. న్యూఢిల్లీలోని సీ-11/23, తిలక్ వీధిలో   పటియాల హౌస్ కోర్టు కాంప్లెక్స్ సమీపంలో కేజ్రీవాల్ నివాసం ఉంది.  ఢిల్లీ సచివాలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరవింద్ నివాసానికి కావాల్సిన సామాగ్రిని ఈ రోజు  తరలించారు. అయితే  తొలిరోజు  అక్కడే బస చేయనున్నారు.

మూడు పడక గదులు మాత్రమే ఉన్న కేజ్రీవాల్ కొత్త ఇల్లు వైశాల్యం 1,600 చదరపు మీటర్లు.  సేవకులు ఉండేందుకు రెండు క్వార్టర్స్తోపాటు, కారు పార్కింగ్ కొరకు సాధారణ గారేజ్ ఉంది.  అంతకముందు కేటాయించిన ప్రభుత్వ అధికార నివాసం నిరాడంబరంగానూ, పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ఉండటంతో ఆయన అందులో నివాసముండటానికి తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement