ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య | First-year MBBS student found hanging in AIIMS girls hostel | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

Published Sun, Aug 30 2015 1:22 PM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM

ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) క్యాంపస్ లో వైద్య విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడింది. ఎంబీబీఎస్ మొదటి  సంవత్సరం చదువుతున్న ఖుబ్బూ చౌదరి(19)  ఆదివారం తెల్లవారుజామున బాలికల హాస్టల్ లో ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఖుబ్బూ ఆత్మహత్యకు కారణాలు వెల్లడికాలేదు. సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. మృతురాలి సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతానికి చెందిన కుష్బూ- జూలై 10న ఎయిమ్స్ లో చేరింది. ఆమె చాలా సరదాగా ఉండేదని కుష్బూ స్నేహితురాళ్లు వెల్లడించారు. గత సాయంత్రం తమతో కలిసి షాపింగ్ చేసిందని తెలిపారు. కుష్బూ ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం కాదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎయిమ్స్ అధికార ప్రతినిధి అమిత్ గుప్తా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement