జెరూసలెం: ఇజ్రాయిల్ మాజీ ప్రధాని ఏరియల్ షారోన్(85) మృతి చెందారు. గత ఎనిమిది సంవత్సరాలుగా కోమాలో ఉన్న షారోన్ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. రోమాన్ గేన్ నగరంలోని షేబా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రాణాలు కోల్పోయారు. షారోన్ మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో రెండు వారాల క్రితం ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షారోన్ మృతి చెందే సమయంలో ఆయన కుమారులు అతనితో పాటే ఉన్నారు. ఆయన అంత్యక్రియ ఏర్పాట్లును ప్రభుత్వ హోదాలో నిర్వహించనున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.