‘మీరు రాళ్లతో కొడితే..మేం ఫ్రీమీల్స్‌తో ఆదరిస్తాం’ అంటున్న పాకిస్తానీ
ఇస్లామాబాద్: ముంబైలో గులాం అలీ కచేరికి బ్రేక్.. పీసీబీ చీఫ్‌తో చర్చలు జరిపితే రాళ్లతో కొడతామంటూ.. శివసేన చేస్తున్న హంగామాకు.. ఫ్రీ భోజనంతో సమాధానం ఇస్తామంటున్నాడు.. పాకిస్తాన్‌కు చెందిన ఇనాయత్ అలీ అనే వ్యాపారవేత్త. ఈయన పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్లో ‘డంకిన్ డోనట్స్’ పేరుతో హోటల్స్ చైన్ నడుపుతున్నారు. పాక్‌లో పర్యటించే భారతీయులకు అక్టోబర్ 17నుంచి తన హోటల్స్‌లో ఉచితంగా భోజనం పెడుతున్నాడు. ఇనాయత్ అలీకి ఎందుకు ఆలోచన వచ్చిందంటే.. అక్టోబర్ 16న పాకిస్తాన్ వ్యాపారవేత్త ముంబైకి వచ్చారు.
అయితే ఫామ్-సీ (పాకిస్తానీయులు భారత పర్యటనలో కచ్చితంగా ఈ పత్రం వెంట ఉంచుకోవాలి) లేని కారణంగా దాదాపు 40 హోటళ్లలో తిరిగినా వారికి ఎవరూ గది ఇవ్వలేదు. దీనిపై పాక్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి చలించిపోయిన ఇనాయత్ అలీ.. తమ దేశం వచ్చే భారతీయులకు ఇలాంటి సమస్య రావొద్దనే ‘ఫ్రీ మీల్స్’ స్కీమ్ ప్రారంభించినట్లు తెలిపారు. అయితే.. ఈ ఆఫర్‌ను పెద్దగా భారతీయులు వినియోగించుకోకపోయినా.. ఈ నిర్ణయం తీసుకున్నాక తన వ్యాపారంలో 30 శాతం వృద్ధి కనిపించిందన్నాడు.
మనోళ్లకు భోజనం ఫ్రీ!
Published Wed, Oct 21 2015 4:38 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM
Advertisement
Advertisement