pcb chief
-
పాకిస్తాన్ కాదు, యూఏఈ కాదు, శ్రీలంక కాదు.. కొత్త ప్రదేశంలో ఆసియా కప్-2023..?
ఆసియా కప్-2023 ఆతిధ్యం విషయమై గతకొద్ది రోజులుగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా భారత్.. పాక్‌లో అడుగుపెట్టేది లేదని తెగేసి చెప్పింది. దీంతో మరో ఆప్షన్ లేని పాక్.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై (యూఏఈ) నిర్వహిస్తామని ప్రతిపాదిస్తూనే, వన్డే ప్రపంచకప్ కోసం తాము కూడా భారత్‌లో పర్యటించమని మెలిక పెట్టింది. తాము భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే, టీమిండియా సైతం పాక్‌లో ఆసియా కప్ మ్యాచ్‌లు ఆడాలని ప్రకటించింది. ఈ మధ్యలో ఏసీసీ మిగతా సభ్య దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్‌లు.. యూఏఈలో ఆసియా కప్ జరిగే సమయానికి ఎండలు అధికంగా ఉంటాయని, అందుకే తాము యూఏఈలో అడుగపెట్టమని ప్రకటించాయి. ఈ సందిగ్థ పరిస్థితుల్లో పీసీబీ చీఫ్ నజమ్ సేథి సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఆతిథ్య హక్కులు తమవే కాబట్టి, వేదికను ఎంచుకునే అధికారం తమకే ఉంటుందని చెబుతూ.. ఆసియాకప్-2023ను పాక్, యూఏఈ, శ్రీలంకల్లో కాకుండా ఇంగ్లండ్‌లో నిర్వహిస్తే బాగుంటుందని అన్నాడు. పీసీబీ బాస్ సరికొత్త ప్రతిపాదనపై ఏసీసీ సభ్య దేశాలు ఏరకంగా స్పందిస్తాయో వేచి చూడాలి. చదవండి: పాక్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ -
భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లపై పీసీబీ కొత్త చీఫ్ కీలక వాఖ్యలు
ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఎనలేని క్రేజ్ ఉంటుదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. ఈ క్రమంలో భారత్-పాక్ జట్లు ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి ఈవెంట్లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి. అయితే ఇరు దేశాల అభిమానులు మాత్రం చిరకాల ప్రత్యర్ధిలు ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడితే చూడాలని భావిస్తున్నారు. ఇక 2012-13లో చివరగా ద్వైపాక్షిక సిరీస్‌లో పాక్‌తో భారత్ తలపడింది.కాగా భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణపై పీసీబీ కొత్త చీఫ్ నజామ్ సేథీ కీలక వాఖ్యలు చేశాడు. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని నజామ్ సేథీ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా బోర్డు ప్యానెల్ మార్పుకు ముందు న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు పీసీబీ జట్టును ఎంపిక చేయడాన్ని అతడు తప్పు బట్టాడు. "ప్రస్తుతం పాక్ జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. అయితే ప్యానల్ మార్పుకు ముందు కివీస్ సిరీస్‌కు జట్టును ప్రకటించకుండా ఉంటే బాగుండేది. కానీ పాకిస్తాన్లో అన్ని ప్రధాన జట్లు పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. న్యూజిలాండ్ సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది. దేశవాళీ క్రికెట్ నుంచి మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తాము" అని విలేకరుల సమావేశంలో సేథీ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో వరుసగా సిరీస్‌లు ఓడిపోవడంతో రమీజ్ రజాను పీసీబీ చైర్మెన్ పదవి నుంచి పాక్ ప్రభుత్వం తొలిగించింది. ఈ క్రమంలో అతడి స్థానంలో సేథీ పీసీబీ కొత్త బాస్‌గా బాధ్యతలు చేపట్టాడు. చదవండి: IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..! -
భారత్‌తో క్రికెట్ ఆడేందుకు మేం రెడీ: పాకిస్తాన్
భారత ప్రభుత్వం సరేనంటే.. టీమిండియాతో క్రికెట్ ఆడేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షాహ్రయార్ ఖాన్ చెప్పారు. ఈ ఏడాది చివర్లో దుబాయ్‌లో జరిగే పూర్తిస్థాయి పర్యటనకు భారత ప్రభుత్వం ఆమోదం తెలియజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, బీసీసీఐ మాత్రం ఇంతవరకు ఈ విషయమై తమను సంప్రదించలేదని ఖాన్ తెలిపారు. భారత ప్రభుత్వం సరేనంటే తాము పాక్ ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లతో కూడిన పూర్తిస్థాయి సిరీస్ ఒకదాన్ని దుబాయ్‌లో ఈ ఏడాది చివర్లో నిర్వహిస్తే బాగుంటుందని బీసీసీఐ ప్రతిపాదించింది. దీనిపై హోం మంత్రిత్వశాఖకు బీసీసీఐ లేఖ రాసిందని, పాక్‌తో ఆడేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరిందని అంటున్నారు. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ చాలావరకు అంతర్జాతీయ మ్యాచ్‌లను తమ స్వదేశంలో కాకుండా వేరే దేశాల్లో నిర్వహిస్తూ ఉంటుంది. ఎక్కువగా దుబాయ్ వెళ్తుంది. 2009 మార్చి 3వ తేదీన పాకిస్తాన్లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టు ఆటగాళ్లున్న బస్సు మీద ఉగ్రవాదులు దాడి చేయడంతో, ఆ తర్వాతి నుంచి ఏ దేశం జట్టు కూడా పాక్ గడ్డ మీద అడుగుపెట్టలేదు. అప్పట్లో జరిగిన దాడిలో ఆరుగురు క్రీడాకారులతో పాటు బ్రిటిష్ కోచ్ కూడా గాయపడ్డారు. -
మనోళ్లకు భోజనం ఫ్రీ!
‘మీరు రాళ్లతో కొడితే..మేం ఫ్రీమీల్స్తో ఆదరిస్తాం’ అంటున్న పాకిస్తానీ ఇస్లామాబాద్: ముంబైలో గులాం అలీ కచేరికి బ్రేక్.. పీసీబీ చీఫ్‌తో చర్చలు జరిపితే రాళ్లతో కొడతామంటూ.. శివసేన చేస్తున్న హంగామాకు.. ఫ్రీ భోజనంతో సమాధానం ఇస్తామంటున్నాడు.. పాకిస్తాన్‌కు చెందిన ఇనాయత్ అలీ అనే వ్యాపారవేత్త. ఈయన పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్‌లో ‘డంకిన్ డోనట్స్’ పేరుతో హోటల్స్ చైన్ నడుపుతున్నారు. పాక్‌లో పర్యటించే భారతీయులకు అక్టోబర్ 17నుంచి తన హోటల్స్‌లో ఉచితంగా భోజనం పెడుతున్నాడు. ఇనాయత్ అలీకి ఎందుకు ఆలోచన వచ్చిందంటే.. అక్టోబర్ 16న పాకిస్తాన్ వ్యాపారవేత్త ముంబైకి వచ్చారు. అయితే ఫామ్-సీ (పాకిస్తానీయులు భారత పర్యటనలో కచ్చితంగా ఈ పత్రం వెంట ఉంచుకోవాలి) లేని కారణంగా దాదాపు 40 హోటళ్లలో తిరిగినా వారికి ఎవరూ గది ఇవ్వలేదు. దీనిపై పాక్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి చలించిపోయిన ఇనాయత్ అలీ.. తమ దేశం వచ్చే భారతీయులకు ఇలాంటి సమస్య రావొద్దనే ‘ఫ్రీ మీల్స్’ స్కీమ్ ప్రారంభించినట్లు తెలిపారు. అయితే.. ఈ ఆఫర్‌ను పెద్దగా భారతీయులు వినియోగించుకోకపోయినా.. ఈ నిర్ణయం తీసుకున్నాక తన వ్యాపారంలో 30 శాతం వృద్ధి కనిపించిందన్నాడు.