జన్యు మార్పుతో మధుమేహం దూరం! | Gene mutations that protect from diabetes identified | Sakshi
Sakshi News home page

జన్యు మార్పుతో మధుమేహం దూరం!

Published Tue, Mar 4 2014 5:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

జన్యు మార్పుతో మధుమేహం దూరం!

జన్యు మార్పుతో మధుమేహం దూరం!

వాషింగ్టన్: అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలనూ వణికిస్తున్న మధుమేహం మహమ్మారి నుంచి రక్షించే ఒక జన్యు ఉత్పరివర్తనాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జన్యు ఉత్పరివర్తనం ద్వారా కలిగే లక్షణాలను ఔషధాలతో కలిగించగలిగితే టైప్-2 మధుమేహాన్ని దూరంగా ఉంచవచ్చని వారు చెబుతున్నారు. అమెరికాకు చెందిన బ్రాడ్ ఇనిస్టిట్యూట్, మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులు కలిసి దాదాపు లక్షా 50 వేల మందిపై పరిశోధన చేశారు. సాధారణంగా ‘ఎస్‌ఎల్‌సీ30ఏ8’గా పిలిచే జన్యువు విడుదల చేసే ఒక ప్రోటీన్ టైప్-2 మధుమేహం వచ్చేందుకు తోడ్పడుతుందని గుర్తించినట్లు వారు తెలిపారు.
 
 ఈ జన్యువులో వచ్చే ఉత్పరివర్తనం (మార్పు) కారణంగా.. టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఏకంగా 65 శాతానికిపైగా తగ్గిపోయినట్లుగా గుర్తించామని వారు తెలిపారు. అదికూడా సదరు వ్యక్తులు వృద్ధాప్యంతోను, ఊబకాయంతోను ఉన్నా సరే మధుమేహం వచ్చే అవకాశం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఈ జన్యు మార్పు తరహాలో పనిచేయగల, ఆ ప్రోటీన్‌ను నియంత్రించగల ఔషధాలను రూపొందిస్తే.. మధుమేహాన్ని దాదాపు శాశ్వతంగా దూరం చేయవచ్చని పరిశోధకులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement