యెమన్ రాజధాని సనా నగరంలో కిడ్నాప్ యత్నం నుంచి బయటపడిన ఓ జర్మన్ దౌత్యవేత్త తీవ్రంగా గాయపడ్డారు. గుర్తుతెలియని సాయుధులు ఆయనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిచంఇనట్లు యెమన్ హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. హడ్డా ప్రాంతంలో ఉన్న జర్మనీ రాయబార కార్యాలయం సమీపంలో దౌత్యవేత్త వెళ్తున్న కారును తమ కారుతో అడ్డగించేందుకు సాయుధులు ప్రయత్నించారు.
అయితే కారు ఆపేందుకు దౌత్యవేత్తతో పాటు డ్రైవర్ కూడా నిరాకరించి, వేగంగా వాహనాన్ని పోనించారు. వెంటనే సాయుధులు తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరపగా, దౌత్యవేత్త స్వల్పంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. సాయుధులు వెంటనే అక్కడినుంచి పారిపోయారు. దౌత్యవేత్త కాలికి గాయం అయినట్లు రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి.
దౌత్యవేత్తపై కిడ్నాప్ యత్నం
Published Tue, Apr 29 2014 9:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement
Advertisement