‘‘గోల్డ్ బాండ్ ’ అమ్మకాల్లో హైదరాబాద్ రీజియన్ టాప్
హైదరాబాద్ రీజియన్ టాప్
సాక్షి, సిటీ బ్యూరో: రాష్ట్రంలో పోస్టల్ శాఖ సుమారు 14,082 గోల్డ్ బాండ్లను విక్రయించి రూ.6.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వాస్తవంగా 30 లక్షల గోల్డ్ బాండ్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ కేవలం 10 రోజుల మాత్రమే సమయం కేటాయించడంతో 50 శాతం వరకు సాధించగలిగింది. మొత్తం మీద హైదరాబాద్ సిటీ రీజియన్ సుమారు 8,984 గోల్డ్ బ్రాండ్లు విక్రయించి రికార్డు సృష్టించింది. మిగిలిన హైదరాబాద్ (తెలంగాణ) రీజియన్‌లో మాత్రం 5,098 బాండ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రాష్ట్రంలో 95 ప్రధాన పోస్టాఫీసులు, 2,353 సబ్ పోస్టాఫీసులు, 13,712 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నారుు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో భాగంగా పోస్టాఫీసుల్లో గత నెల 24 నుంచి ఈనెల 2 వరకు గోల్డ్‌బాండ్‌ల ను విక్రయించారు. 999 స్వచ్ఛత కలిగి సాధారణ సగటు ఒక గ్రాము బంగారం ధర రూ. 3,007 ఉండగా, రూ. 50లు డిస్కౌంట్‌తో రూ.2,957 చొప్పున బాండ్‌ను పోస్టాఫీసుల్లో లభించడంతో ప్రజలు ఆసక్తి కనబర్చారు.