Gold Bond
-
బంగారం ఇలా కొంటే రూ.16 వేలు ఆదా..!
-
జూలై 10న గోల్డ్ బాండ్స్ కొత్త ఇష్యూ
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీము కింద ప్రభుత్వం జూలై 10న మలివిడత గోల్డ్ బాండ్ల ఇష్యూను ప్రారంభించనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి గోల్డ్ బాండ్ల ఇష్యూ. ఈ ఇష్యూకు దరఖాస్తులు జూలై10–14 తేదీల మధ్య స్వీకరిస్తామని, బాండ్లను జూలై 28న జారీచేస్తామని గురువారం విడుదలైన ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది. ఒక గ్రాము బంగారానికి సమానంగా ఒక బాండు జారీఅవుతుంది. ఈ బాండ్లలో కనీస పెట్టుబడి ఒక గ్రాముకాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాములకు సమానమైన బాండ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. 8 సంవత్సరాల కాలపరిమితితో జారీచేసే ఈ బాండ్లపై 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.2015 నవంబర్‌లో ఈ స్కీమును ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ 8 దఫాలు పుత్తడి బాండ్లను జారీచేసి, రూ. 5,400 కోట్లు సమీకరించారు. -
‘‘గోల్డ్ బాండ్ ’ అమ్మకాల్లో హైదరాబాద్ రీజియన్ టాప్
హైదరాబాద్ రీజియన్ టాప్ సాక్షి, సిటీ బ్యూరో: రాష్ట్రంలో పోస్టల్ శాఖ సుమారు 14,082 గోల్డ్ బాండ్లను విక్రయించి రూ.6.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వాస్తవంగా 30 లక్షల గోల్డ్ బాండ్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ కేవలం 10 రోజుల మాత్రమే సమయం కేటాయించడంతో 50 శాతం వరకు సాధించగలిగింది. మొత్తం మీద హైదరాబాద్ సిటీ రీజియన్ సుమారు 8,984 గోల్డ్ బ్రాండ్లు విక్రయించి రికార్డు సృష్టించింది. మిగిలిన హైదరాబాద్ (తెలంగాణ) రీజియన్‌లో మాత్రం 5,098 బాండ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రాష్ట్రంలో 95 ప్రధాన పోస్టాఫీసులు, 2,353 సబ్ పోస్టాఫీసులు, 13,712 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నారుు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో భాగంగా పోస్టాఫీసుల్లో గత నెల 24 నుంచి ఈనెల 2 వరకు గోల్డ్బాండ్ల ను విక్రయించారు. 999 స్వచ్ఛత కలిగి సాధారణ సగటు ఒక గ్రాము బంగారం ధర రూ. 3,007 ఉండగా, రూ. 50లు డిస్కౌంట్‌తో రూ.2,957 చొప్పున బాండ్‌ను పోస్టాఫీసుల్లో లభించడంతో ప్రజలు ఆసక్తి కనబర్చారు. -
పోస్టాఫీసుల్లోనూ గోల్డ్ బాండ్లు..
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ శాఖ ‘గోల్డ్ బాండ్‘ అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో భాగంగా పోస్టాఫీసుల్లో బాండ్లను అందుబాటులో ఉంచారు. 999 స్వచ్ఛత కలిగిన బంగారం సగటు ధర ప్రకారం విలువను లెక్కిస్తున్నారు. ప్రస్తుతం సాధారణ సగటు ఒక గ్రాము బంగారం ధర రూ. 3007 ఉండగా, రూ. 50లు డిస్కౌంట్‌తో రూ.2957 చొప్పున బాండ్‌ను పోస్టాఫీసుల్లో విక్రరుుస్తున్నారు. ఇన్వెస్టర్లు 1 గ్రాము నుంచి 500 గ్రాముల విలువ గల గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బాండ్ విలువపై ప్రతి సంవత్సరానికి ఫిక్స్డ్ వడ్డీ 2.50 శాతం వర్తింప జేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి బాండుహోల్డరు బ్యాంక్ ఖాతాలో ఫిక్స్డ్ వడ్డీ జమ అవుతుంది. బాండ్ కాలపరిమితి 8 సంవత్సరాలు కాగా, ఐదేళ్ల తర్వాత బాండ్‌ను నగదుగా మార్చుకోవచ్చు. ఆ సమయంలో మార్కెట్లో గల బంగారం ధర విలువను నగదు రూపంలో పెట్టుబడిదారులకు అందిస్తారు. గోల్డ్ బాండ్ ఆధారంగా బ్యాంకుల్లో రుణం కూడా పొందేందుకు వెసులుబాటు ఉంటుంది. 30 వేల బాండ్ల విక్రయాల లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 వేల గోల్డ్ బాండ్లను విక్రరుుంచాలని పోస్టల్ శాఖ లక్ష్యాన్ని నిర్ణరుుంచింది. రాష్ట్రంలో మొత్తం 95 ప్రధాన పోస్టాఫీసులు, 2,353 సబ్ పోస్టాఫీస్‌లు,13,712 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నారుు. ఈ నెల 24న గోల్డ్ బాండ్ పథకం ఆరో విడత ప్రారంభం కాగా, ఇప్పటి వరకు సుమారు 1500పైగా బాండ్‌స అమ్ముడు పోరుునట్లు పోస్టల్ శాఖాధికారులు పేర్కొంటున్నారు. మదుపుదారులు గోల్డ్ బాండ్ కోసం విలువ రూ.20 వేలు మించితే చెక్కు రూపంలో అందించాల్సి ఉంటుంది. ఈ పథకం ప్రవాస భారతీయులకు వర్తించదు. నవంబర్ 2 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. -
స్టాక్ ఎక్స్ఛేంజ్ లలోకి తాజా గోల్డ్ బాండ్లు
రేపటి నుంచి ట్రేడింగ్ ప్రారంభం ముంబై: గత నెల జారీ చేసిన గోల్డ్ బాండ్లలో బుధవారం నుంచి ట్రేడింగ్ ప్రారంభం కానుంది. గత నెల 30న జారీ అయి డీమ్యాట్ మోడ్‌లో ఉన్న బంగాం బాండ్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈ నెల 19వ తేదీ నుంచి ట్రేడింగ్‌కు అర్హమైనవని ఆర్బీఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఐదో విడత గోల్డ్ బాండ్ల జారీ ప్రకటనను ఆగస్ట్‌లో జారీ చేసింది. సెప్టెంబర్ 1-9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా... రెండు లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. అదే నెల 30న బాండ్లను జారీ చేసింది. బంగారంపై పెట్టుబడులకు సంబంధించి ఆభరణాలకు ప్రత్యామ్నాయంగా కేంద్రం ఈ బాండ్లను తొలిసారి గతేడాది నవంబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. -
పసిడి బాండ్లు... డబ్బు ఆర్బీఐకి
చేరేవరకూ 4% వడ్డీ! న్యూఢిల్లీ: నాలుగవ విడత పసిడి బాండ్లను కొన్నవారికిది శుభవార్తే. ఎందుకంటే బాండ్లకోసం ఇన్వెస్టర్లు చెల్లించిన డబ్బు ఎక్స్ఛేంజ్ లేదా ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ (ఐసీసీఎల్) నుంచి రిజర్వ్ బ్యాంక్‌కు బదిలీ అవ్వాల్సి ఉంటుంది. అప్పటి నుంచే బాండ్లు జారీ అయి... వాటిపై వడ్డీ కూడా అందుతుంది. అయితే ఈ లోగా ... అంటే ఆర్బీఐకి చేరేలోగా ఎన్నిరోజులైతే అన్ని రోజులకు 4 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రస్తుత సేవింగ్స్ బ్యాంక్ రేటుకు సమానం కావడం గమనార్హం. ఈ రేటు ప్రత్యక్షంగా ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమవుతుందని బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బీఎస్ఈ ప్లాట్‌ఫామ్‌పై సావరిన్ గోల్డ్ బాండ్ అలాట్ అయ్యేంతవరకూ బిడ్స్‌కు సంబంధించి వచ్చిన డబ్బుపై ఈ వడ్డీని ఐసీసీఎల్ ద్వారా చెల్లిస్తుందని తెలియజేసింది. అయితే డబ్బు విత్‌డ్రాయెల్స్ విషయంలో ఈ వడ్డీ చెల్లింపులు ఉండబోవని స్పష్టం చేసింది. నాల్గవ విడత గోల్డ్ బాండ్ పథకం 18న ప్రారంభమైంది. జూలై 22న ముగుస్తుంది. తరువాత బాండ్లు జారీ అవుతాయి. ఎక్స్ఛేంజ్ల్లో ట్రేడింగ్ కూడా జరిగే ఈ బాండ్ కూపన్ వార్షిక రేటు 2.75 శాతం. -
గోల్డ్ బాండ్ ట్రేడింగ్ శుభారంభం
ముంబై: స్టాక్ ఎక్స్చేంజ్ల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ సోమవారం శుభారంభం చేసింది. ట్రేడింగ్ తొలి రోజే 7 శాతం లాభాలు వచ్చాయి. గ్రామ్ డినామినేషన్ గోల్డ్ బాండ్ రూ.2,930 వద్ద నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అయింది. 7.43 శాతం లాభంతో రూ.3,147.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10.3 శాతం లాభంతో రూ.3,258 గరిష్ట స్థాయిని తాకింది. 736 లావాదేవీలు జరిగాయి. టర్నోవర్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో కలిపి రూ.23.18 లక్షలుగా నమోదైంది. భౌతికంగా బంగారాన్ని కొనకపోయినప్పటికీ, ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసుకోవడానికి సావరిన్ గోల్డ్ బాండ్స్ వీలు కల్పిస్తాయి. గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 30న ప్రారంభించింది. -
రెండో విడత గోల్డ్ బాండ్లతో రూ.726 కోట్లు
తొలి విడతకన్నా మూడు రెట్లు అధికం న్యూఢిల్లీ: రెండవ విడత గోల్డ్ బాండ్ల జారీ ద్వారా కేంద్రం రూ.726 కోట్లు సమీకరించింది. మొత్తం 2,790 కేజీలకు సబ్స్క్రిప్షన్లు రావటంతో ఈ నిధులు సమకూరినట్లు ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్ ట్వీట్ చేశారు. మొదటి విడతలో సమీకరించిన మొత్తం కన్నా ఇది మూడు రెట్లు అధికమన్నారు. నవంబర్‌లో జారీ అయిన తొలి విడత స్కీమ్‌లో 916 కేజీలకు సంబంధించి రూ.246 కోట్లు సమీకరించటం తెలిసిందే. రెండవ దఫాలో 3.16 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు దాస్ తెలిపారు. గత దఫా ఈ దరఖాస్తుల సంఖ్య 62,169గా ఉంది. తొలి విడతతో పోలిస్తే రెండో దఫాలో మంచి స్పందన వచ్చినట్లు దాస్ తెలిపారు. రెండవ విడత ఆఫర్ జనవరి 18న ప్రారంభమై, జనవరి 22న ముగియటం తెలిసిందే. ఫిబ్రవరి 8న ఇందుకు సంబంధించి బాండ్లను కేటాయిస్తారు. క్రమంగా ఈ పథకాలకు ప్రజాదరణ లభిస్తున్న విషయం తాజా బాండ్ల జారీతో వెల్లడయిందని దాస్ వివరించారు. కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి అందిన సమాచారం... ప్రాథమికమైనదేనని, మరింత సమాచారం అందాల్సి ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఇష్యూకు సంబంధించి 99.9 స్వచ్ఛత ఉన్న గ్రాము ధర రూ.2,600. గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం 2.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఏడాది జవనరి 11-15 తేదీల్లోని 99.9 స్వచ్ఛత బంగారం ధర సగటు ఆధారంగా బాండ్ల ధరను నిర్ణయించారు. లక్ష్యం కష్టమే!: గోల్డ్ బాండ్ పథకం ద్వారా మార్చికి రూ.15,000 కోట్లు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణ కార్యక్రమంలో గోల్డ్ బాండ్ స్కీమ్ భాగంగా ఉంది. తొలి దశకన్నా రెండవ దశ కొంత మెరుగైన ఫలితం కనబడటం ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం. -
మళ్లీ గోల్డ్ బాండ్లు..
స్కీమ్ రెండవ విడత ప్రారంభం ♦ జనవరి 22న ఇష్యూకు ముగింపు ♦ 99.9 ప్యూరిటీ గ్రాముకు రూ.2,600 ♦ వార్షిక వడ్డీరేటు 2.75 శాతం ముంబై: రెండవ విడత సావరిన్ గోల్డ్ పథకం సోమవారం ప్రారంభమైంది. 22వ తేదీ (శుక్రవారం) వరకూ ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఇష్యూకు సంబంధించి 99.9 స్వచ్ఛత ధర గ్రాముకు రూ.2,600గా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాండ్లపై ప్రభుత్వం 2.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ ఏడాది జనవరి 11-15 తేదీల్లోని 99.9 స్వచ్ఛత బంగారం ధర సగటు ఆధారంగా బాండ్ల ధర నిర్ణయం జరిగింది. గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయాలని భావించే ఇన్వెస్టర్లు జనవరి 18 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్లలో ఇందుకు సంబంధించి దరఖాస్తులను ప్రత్యక్షంగాకానీ లేదా ఏజెంట్ల ద్వారా దాఖలు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు చూస్తే... బంగారం బాండ్ల మంజూరు ప్రక్రియ ఫిబ్రవరి 8 నుంచి ఉంటుంది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ సాగిన... తొలి విడత గోల్డ్ బాండ్ల ధర (గ్రాముకు రూ.2,684)తో పోలిస్తే ప్రసుత్తం గోల్డ్ బాండ్ల ధర గ్రాముకు రూ.84 తక్కువగా ఉంది. {పజలు 2 గ్రాముల నుంచి 500 గ్రాముల పరిమాణం వరకు బాండ్లను కొనుగోలు చే యవచ్చు. ఒక వ్యక్తి ఏడాదిలో 500 గ్రాములకు మించిన విలువగల పసిడి బాండ్లు కొనుగోలు చేయడానికి వీలులేదు. బంగారం బాండ్ల జారీ ఫిబ్రవరి 8న. మెచ్యూరిటీ కాలం- జారీ తేదీ నుంచి 8 ఏళ్లు. బంగారం బాండ్లపై వచ్చిన వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఐదేళ్ల నుంచే ముందస్తు నగదు మార్పిడి అమల్లో ఉంటుంది. బాండ్ మెచ్యూరిటీ సమయంలో ఉన్న ధరకు అనుగుణంగా అందుకు సమానమైన పసిడి లేదా నగదు విలువను ఇన్వెస్టర్ పొందవచ్చు. రుణాలు పొందడానికి హామీగా బాండ్లను వినియోగించుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ నోటిఫై చేసిన తేదీ నుంచీ బాండ్లు ట్రేడయ్యే అవకాశం ఉంది. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులు వర్తిస్తాయి. నిధుల సమీకరణ లక్ష్యం కష్టమే..! గోల్డ్ బాండ్ పథకం ద్వారా మార్చి నాటికి రూ.15,000 కోట్లు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణ కార్యక్రమంలో గోల్డ్ బాండ్ స్కీమ్ భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో ప్రారంభమైన తొలి విడత గోల్డ్ బాండ్ల మంజూరు ప్రక్రియలో ప్రజల నుంచి 62,169 దరఖాస్తులు వచ్చాయి. రూ.246 కోట్ల విలువైన 916 కిలోల బంగారు బాండ్లు కొనుగోలు చేశారు. లక్ష్యంతో పోల్చితే ఈ సమీకరణ తక్కువే కావడం గమనార్హం. పసిడి డిపాజిట్ స్కీమ్‌లో సోమనాథ్ దేవాలయ బంగారం! అహ్మదాబాద్: గోల్డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడులు పెట్టడానికి గుజరాత్‌కు చెందిన ప్రముఖ సోమనాథ్ దేవాలయం ట్రస్ట్ సిద్ధమయ్యింది. దేవాలయానికి సంబంధించి రోజూవారీ వినియోగించకుండా ఉంటున్న పసిడిని డిపాజిట్ పథకంలో పెట్టుబడిగా పెట్టాలని ట్రస్ట్ నిర్ణయించింది. దేవాలయం ట్రస్టీ సభ్యుల్లో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉన్నారు. స్వచ్ఛత, ఆభరణాల పసిడి కలిసి ప్రస్తుతం దేవాలయం వద్ద దాదాపు 35 కేజీల పసిడి ఉంది. ఇందులో రోజువారీగా వినియోగించని పసిడిని (స్వచ్ఛత) వేరుచేసి డిపాజిట్ చేయాలని ప్రధాని మోదీ నివాసంలో ఈ నెల 12న జరిగిన ట్రస్టీ సభ్యుల సమావేశం నిర్ణయించినట్లు ట్రస్ట్ సెక్రటరీ పీకే లాహిరి సోమవారం తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే పసిడి డిపాజిట్ పథకంలో చేరిన మొట్టమొదటి దేవాలయంగా గుజరాత్ సోమనాథ్ దేవాలయం నిలవనుంది. కేంద్రం ప్రవేశపెట్టిన రెండు పసిడి పథకాల్లో బాండ్స్‌తో పాటు పసిడి డిపాజిట్ కూడా ఒకటి. అయితే డిపాజిట్ స్కీమ్‌కు ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. -
ఈ నెల 18న రెండో దశ గోల్డ్ బాండ్ పథకం
న్యూఢిల్లీ: రెండో విడత గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ఈ నెల 18న బ్యాంకులు ప్రారంభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 22 వరకూ ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ ఉంటుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన మొదటి విడత గోల్డ్‌బాండ్ స్కీమ్‌లో రూ.246 కోట్ల విలువైన 915.95 కేజీల బంగారం బాండ్లను బ్యాంకులు జారీ చేశాయి. ఈ పథకానికి మంచి స్పందన వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. -
పుత్తడి బాండ్ల కలెక్షన్ రూ. 150 కోట్లే
ఇష్యూ ధర అధికంగా ఉండడడే కారణం ముంబై: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఆరంభించిన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌కు తగిన స్పందన లభించలేదు. రూ. 150 కోట్లకు మాత్రమే గోల్డ్‌బాండ్లకు దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఇష్యూ ధర(గ్రాములకు రూ.2,684) అధికంగా ఉండడం దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వ రంగ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సెలవు రోజులు రావడం, బంగారాన్ని బాండ్ల రూపంలో కాకుండా ఆభరణాలుగా గానో, బిస్కట్ల రూపంలోనే ఉంచుకోవడంపైనే ప్రజలు మక్కువ చూపడం వంటి అంశాలు కూడా పేలవమైన స్పందనకు కారణమని వారంటున్నారు. గోల్డ్ బాండ్ల ద్వారా ఎంత మొత్తం నిధులు వచ్చాయో ఆర్బీఐ వెల్లడించనప్పటికీ, రూ.150 కోట్ల వరకూ ఉండొచ్చని బ్యాంకర్లు భావిస్తున్నారు. గ్రాముకు రూ.2,684 ఇష్యూధరగా ఆర్బీఐ నిర్ణయించిందని, ఇది మార్కెట్ ధర కన్నా ఎక్కువని ఒక ప్రభుత్వ బ్యాంక్ ఉన్నతాధికారి చెప్పారు. మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పుడు అధిక ధరకు ఈ బాండ్లను ఎవరు కొంటారని ఆయన ప్రశ్నించారు. ఈ గోల్డ్ బాండ్ల ద్వారా రూ.50 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ దీంట్లో పదవ వంతు కూడా సమీకరించలేకపోయామని చెప్పారు. ప్రధాని మోదీ ఈ నెల 5న మూడు పుత్తడి పథకాలను ప్రారంభించారు. సావరిన్ గోల్డ్ బాండ్, గోల్డ్ మోనోటైజేషన్, గోల్డ్ కాయిన్ స్కీమ్‌లను ఆరంభించారు. గోల్డ్ బాండ్ స్కీమ్‌కు సంబంధించి మొదటి దశ ఈ నెల 5న ప్రారంభమై 20న ముగిసింది. -
ఇక పసిడికీ వడ్డీ వస్తుంది..
- గోల్డ్ బాండ్, డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం - మెటల్‌కు దేశీయంగా డిమాండ్‌ను తగ్గించే ప్రయత్నం - బీరువాలకే పరిమితమవుతున్న కనకం మార్కెట్లోకి వచ్చే ఏర్పాటు న్యూఢిల్లీ: బంగారం బాండ్, పసిడి డిపాజిట్ (మోనిటైజేషన్) పథకాలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. మెటల్‌గా (ఫిజికల్ గోల్డ్) పసిడి డిమాండ్‌ను తగ్గించడానికి, ఇళ్లలో, సంస్థల్లో బీరువాలకే పరిమితమవుతున్న పసిడిని వ్యవస్థలోకి తీసుకువచ్చి, ఆర్జన సామర్థ్యం సమకూర్చడం, తద్వారా దేశ ఆర్థిక పటిష్టత ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాలు. కేబినెట్ సమావేశం అనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. పసిడికి ప్రత్యామ్నాయంగా ఫైనాన్షియల్ అసెట్‌ను అభివృద్ధి చేయడానికి సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్జీబీ) స్కీముని ప్రారంభించాలని ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదించింది. ఇందుకనుగుణంగా తాజా పథకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పసిడి నిల్వల నిధి ఏర్పాటు... తాజా బంగారం పథకాల నేపథ్యంలో పసిడి ధరల్లో మార్పుల ఇబ్బందులను ఎదుర్కొనడానికి ఒక పసిడి నిల్వల నిధి ఏర్పాటు కానున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ఈ పథకాల వల్ల వచ్చే లాభ, నష్టాలను ఈ ఫండ్ నిర్వహిస్తుంది. 2015-16 నుంచీ ప్రభుత్వ మార్కెట్ రుణ ప్రణాళికలో భాగంగా ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి. బాండ్ల ధర ఎలా ఉండాలన్న అంశాన్ని ఆర్థికమంత్రిత్వశాఖతో సంప్రదింపులతో ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం కడ్డీలు, నాణేల రూపంలో దాదాపు 300 టన్నుల పసిడి ఫిజికల్‌గా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పెట్టుబడులలో కొంత బాండ్లలోకి వస్తాయని భావిస్తున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. కనుక ఈ బాండ్లకు సావరిన్ (ప్రభుత్వ) గ్యారెంటీ ఉంటుంది. అందువల్ల బాండ్లు సావరిన్ రుణాల కిందకు వస్తాయి. తద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచీ ద్రవ్య లోటు లక్ష్యం పరిధిలో ఇవి ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వ రుణ ప్రణాళిక. ఇందులో దాదాపు రూ.3.6 లక్షల కోట్ల రుణ సమీకరణ సెప్టెంబర్ కల్లా పూర్తవుతుంది. గోల్డ్ బాండ్ స్కీమ్‌కు కూడా కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. గోల్డ్ బాండ్, డిపాజిట్ స్కీమ్‌లను పరిశ్రమ సమాఖ్య స్వాగతించింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వల్ల పారదర్శకత పెరుగుతుందని, లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని, గోల్డ్ సేవింగ్స్‌ను ఆర్థిక పెట్టుబడుల రూపంలోకి మరల్చే సామర్థ్యం దీనికి ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సోమసుందరమ్ పీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్య వల్ల బంగారం దిగుమతులు తగ్గుతాయని, పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని ఆల్ ఇండియా జెమ్స్, జ్యువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ మాజీ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా పేర్కొన్నారు. డిపాజిట్ స్కీమ్ ఇలా.. - ప్రజలు తమ వద్ద అదనంగా ఉన్న పసిడిని బ్యాంకుల్లో స్వల్ప (1-3 సంవత్సరాలు), మధ్య (5-7 సంవత్సరాలు), దీర్ఘకాలిక కాలాలకు (12-15 సంవత్సరాలు) డిపాజిట్ చేసుకోవచ్చు. - బంగారం రూపంలో వడ్డీని గుణించి, మెచ్యూరిటీ తరువాత నగదు రూపంలో అసలు, వడ్డీలను చెల్లిస్తారు. అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో పసిడి డిపాజిట్ విలువపై 0.75 శాతం నుంచి 2శాతం వరకూ వడ్డీ ఉంది. - స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీరేటు ఆయా బ్యాంకులు నిర్ణయిస్తాయి. మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేటు (బ్యాంకుల సేవలను ఫీజులు సహా) ఆర్బీఐతో సంప్రదించి కాలానుగుణంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. - దేశంలో అదనపు పసిడి దాదాపు 20,000 టన్నులు ఉంటుందని అంచనా. తాజా పథకం వల్ల దాదాపు రూ.5,40,000 కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తాయని అంచనా. - స్థిర డిపాజిట్ల తరహాలోనే ఈ మూడు కాలాల పసిడి డిపాజిట్లకు లాక్-ఇన్-పీరియడ్ బ్రేకింగ్‌కు వీలుంటుంది. అయితే ముందస్తు ఉపసంహరణల విషయంలో (కొంతభాగం ఉపసంహరణ సహా) కొంత జరిమానా అమలవుతుంది. - వ్యక్తులు లేదా వ్యవస్థలు కనీసం 30 గ్రాములు డిపాజిట్ చేయాలి. డిపాజిట్‌కు సంబంధించి లభించే వడ్డీని ఆదాయపు పన్ను, కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. - ఇదేమీ బ్లాక్ మనీ వంటి అంశాలకు దారితీసే ప్రొడక్ట్ కాదు. సాధారణ పన్ను నిబంధనలు అన్నీ ఈ డిపాజిట్ స్కీమ్‌కూ వర్తిస్తాయి. - ధరలు పెరిగితే ఈ డిపాజిట్ వల్ల డిపాజిట్‌దారుకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే డిపాజిట్ చేసిన పసిడి విలువకు సంబంధించి వడ్డీ కూడా పొందవచ్చు. - డిపాజిట్ కాల వ్యవధి పూర్తయిన తరువాత, డిపాజిట్‌దారు అప్పటి పసిడి వాస్తవ విలువను పొందవచ్చు. స్వల్పకాలిక డిపాజిట్ అయితే ఫిజికల్ గోల్డ్‌ను పొందే వీలుంది. రెండు సందర్భాల్లో వడ్డీ లభిస్తుంది. డిపాజిట్ చేసిన పసిడి విలువ తగ్గితే... తగ్గిన విలువే లభిస్తుంది. అయితే వడ్డీ ఇక్కడ కస్టమర్‌కు కలిసి వచ్చే అంశం. - డిపాజిట్‌గా వచ్చిన పసిడిని వేలానికి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పసిడి నిల్వల భర్తీలకు వినియోగిస్తారు. అశోక్ చక్రతో కూడిన ఇండియన్ గోల్డ్ కాయిన్ తయారీలో సైతం దీనిని వినియోగిస్తారు. దిగుమతులు తగ్గించడం, దేశీయంగా సరఫరాల మెరుగు లక్ష్యంగా ఆభరణ వర్తకులకు కూడా ఈ పసిడిని అమ్మే వెసులబాటును బ్యాంకులకు కల్పిస్తారు. అయితే ఆయా సందర్భాల్లో నో-యువర్-కస్టమర్ నిబంధనలను బ్యాంకుల తప్పనిసరిగా పాటించాలి. - పసిడి డిపాజిట్ పథకం అమలు తేదీ తత్సబంధ అంశాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుంది. - డిపాజిట్ స్కీమ్ అమల్లో బ్యాంకులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. గోల్డ్ బాండ్ల స్వరూపం... - గోల్డ్ బాండ్ పథకం వార్షిక గరిష్ట పరిమితి వ్యక్తికి 500 గ్రాములు. 5 నుంచి 7 సంవత్సరాల కాలపరిమితితో ఈ బాండ్ల జారీ జరుగుతుంది. ఈ స్కీమ్ ప్రకారం, పసిడిని ఫిజికల్‌గా కాకుండా, భారత పౌరులు గోల్డ్ బాండ్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు. - 5, 10.50, 100 గ్రాముల చొప్పున ఈ గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి. వాటి కాలవ్యవధి 5 నుంచి 7 ఏళ్లు వుంటుంది. దాంతో బంగారం ధరల మధ్యకాలిక ఒడిదుడుకుల నుంచి పెట్టుబడిదారుకు ఊరట లభిస్తుంది. - గోల్డ్ బాండ్ల విషయంలో వడ్డీ రేటు, మార్కెట్లో అప్పటి బంగారం ధర ప్రాతిపదికన ఉంటుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, పోస్టాఫీసుల ద్వారా బాండ్లను మార్చుకుని, డబ్బు తిరిగి తీసుకునే వీలుంటుంది. - భారత పౌరులు, సంస్థలకు మాత్రమే ఈ బాండ్లను ఆఫర్ చేస్తారు. ఇన్వెస్టర్లు మెచ్యూరిటీ కంటే ముందస్తుగా వీటిని అమ్మేందుకు వీలుగా ఎక్స్ఛేంజీలపై ఈ బాండ్లు ట్రేడవుతాయి.