భారీగా పడిన బంగారం, వెండి
వెండి ధరలు ముంబై బులియన్ స్పాట్ మార్కెట్‌లో సోమవారం భారీగా పడ్డాయి. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.500 తగ్గి రూ. 29,800 వద్ద ముగిసింది.
ముంబై: బంగారం, వెండి ధరలు ముంబై బులియన్ స్పాట్ మార్కెట్‌లో సోమవారం భారీగా పడ్డాయి. పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.500 తగ్గి రూ. 29,800 వద్ద ముగిసింది. ఆభరణాల పసిడి కూడా ఇదేస్థాయిలో దిగివచ్చి, రూ.29,650గా నమోదైంది. వెండి కేజీ ధర కూడా ఒకేరోజు రూ.1,000 పడి రూ.50,200కు చేరింది. కారణాలు: పసిడి దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు ప్రభావంతోపాటు, అంతర్జాతీయ ఫ్యూచ ర్స్ నెమైక్స్ మార్కెట్‌లో బలహీన ధోరణి, రూపాయి బలోపేతం, స్టాకిస్టులు, ట్రేడర్ల అమ్మకాలు స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు.
ఫ్యూచర్స్‌లో ఇలా: సోమవారం కడపటి సమాచారం అందేసరికి పసిడి, వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులు బలహీనంగా ట్రేడవుతున్నాయి. అంతరాజతీయంగా నెమైక్స్ పసిడి ధర(ఔన్స్) క్రితం ముగింపుస్థాయిలోనే 1,315 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో రూ.442 నష్టంతో (1.5%) రూ.29,686 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. వెండి కూడా 2 శాతానికి పైగా నష్టంతో (రూ.1,038) రూ. 49,638 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణితో ఫ్యూచర్స్ మార్కెట్ ముగిసి, మంగళవారం రూపాయి మరింత బలపడినట్లయితే పసిడి, వెండిలు మరింత నష్టపోయే (మంగళవారం) అవకాశం ఉందన్నది ట్రేడర్ల విశ్లేషణ.