ఢిల్లీ: రూపాయి బలోపేతం కోసం కేంద్రం చర్యలు చేపడుతుందని కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం తెలిపారు. దేశ ఆర్ధిక అభివృద్ధికి ఎన్నో సవాళ్లు ఆటంకంగా నిలిచాయన్నారు. ఆర్‌బీఐ చర్యలు విఫలమైనా భయాందోళనలు అవసరం లేదని ఆయన తెలిపారు. రూపాయి విలువ అంతకంతకూ క్షీణిస్తున్న తరుణంలో చిదంబరం గురువారం మీడియాతో మాట్లాడారు. రూపాయి బలోపేతం కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మిగతా దేశాల కంటే భారత దేశ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన అబిప్రాయపడ్డారు.
‘రూపాయి బలోపేతం కోసం కేంద్రం చర్యలు’
Published Thu, Aug 22 2013 6:35 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement