పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌! | Govt starts process for roll out of chip-based passports | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌!

Published Fri, Mar 24 2017 8:52 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌!

పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌!

న్యూఢిల్లీ: పాస్‌పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు జోడించి చిప్‌ ఆధారిత ఈ–పాస్‌పోర్టులను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ–పాస్‌పోర్టులను తీసుకొచ్చేందుకు సన్నాహాలను ప్రారంభించామని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్‌ రాజ్యసభలో చెప్పారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా టెండర్లను పిలిచే బాధ్యతను నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌కు అప్పగించినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు, డిజిటల్ సంతకం చిప్ లో ఉంటాయని వెల్లడించారు.

శ్రీలంక అదుపులో 35 మంది, పాకిస్తాన్ నిర్బంధంలో 65 మంది భారత మత్స్యకారులు ఉన్నారని మరో ప్రశ్నకు సమాధానంగా వీకే సింగ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement