‘ఇస్రో యాంత్రిక్స్’పై హ్యాకర్ల దాడి | Hackers attack on ISRO antrix Corporation Limited | Sakshi
Sakshi News home page

‘ఇస్రో యాంత్రిక్స్’పై హ్యాకర్ల దాడి

Published Mon, Jul 13 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

‘ఇస్రో యాంత్రిక్స్’పై హ్యాకర్ల దాడి

‘ఇస్రో యాంత్రిక్స్’పై హ్యాకర్ల దాడి

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారని ఆదివారం సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జె.ప్రసన్న వెల్లడించారు. 2 రోజుల క్రితం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారని, దీంతో యాంత్రిక్స్ తన వెబ్‌సైట్‌ను నిలిపివేసిందన్నారు.

హ్యాకింగ్‌లో చైనా హ్యాకర్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. 2011లోనూ ఈ వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడిచేసినా.. ఆ కంపెనీ సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదన్నారు. వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తున్నామని, వార్షిక నివేదికలను అప్‌లోడ్ చేస్తామని శుక్రవారం యాంత్రిక్స్ చైర్మన్ వీఎస్ హెగ్డే వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement