antrix Corporation Limited
-
భారత ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చిన పారిస్ కోర్టు..?
పారిస్ కోర్టు భారత ప్రభుత్వానికి గట్టి షాకిచ్చింది. గురువారం దేవాస్ వాటాదారులకు పారిస్‌లోని ఎయిర్ ఇండియాకు చెందిన ఒక అపార్ట్మెంట్ ఆస్తి మీద తాత్కాలిక హక్కులను కల్పిస్తూ పారిస్ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్ భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నివాసంగా ఉంది. ఈ అపార్ట్మెంట్ విలువ 3.8 మిలియన్ యూరోలు(సుమారు రూ.32 కోట్లు). "భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆస్తులను కలిగి ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే" అని దేవాస్ షేర్ హోల్డర్స్ సీనియర్ సలహాదారు జే న్యూమాన్ అన్నారు. పారిస్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు దేవాస్ వాటాదారులు పారిస్ అప్ మార్కెట్ ప్రాంతంలోని ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. దేవాస్ వాటాదారులు జాతీయ క్యారియర్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఎయిర్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను కెనడాలోని క్యూబెక్ లోని కోర్టు కొట్టివేసిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం జరిగింది. క్యూబెక్ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి మిచెల్ ఎ. పిన్సన్నాల్ట్ జనవరి 8న ఇచ్చిన తీర్పు ప్రకారం.. దేవాస్ వాటాదారులు అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం(ఐఏటీఏ) వద్ద ఉన్న ఎయిర్ ఇండియా నిధులలో 50 శాతం వరకు స్వాధీనం చేసుకోవచ్చు. ఈ విషయంపై భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. అయితే, అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి తర్వాత నిర్ణయం తీసుకొనున్నట్లు ఒక విమానయాన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మీడియా తెలిపారు. ఇండియా దేవాస్ మల్టీమీడియా కేసు జనవరి 2005లో ఆంట్రిక్స్ కార్పొరేషన్, ఇండియా దేవాస్ మల్టీమీడియా కంపెనీ మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారం.. ఇండియా దేవాస్ మల్టీమీడియా కంపెనీకి చెందిన రెండు ఉపగ్రహాలను ఆంట్రిక్స్ నిర్మించి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఉపగ్రహాలను ఆపరేట్ చేయడానికి ఎస్-బ్యాండ్ 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రాన్ని దేవాస్ మీడియాకు కేటాయించడానికి ఆంట్రిక్స్ కార్పొరేషన్ అంగీకరించింది. ఈ రెండు ఉపగ్రహాల సహాయంతో భారతదేశం అంతటా హైబ్రిడ్ శాటిలైట్, టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సేవలను అందించాలని యోచించింది. ఈ ఒప్పందాన్ని ఆంట్రిక్స్ ఫిబ్రవరి 2011లో రద్దు చేసింది. 2011 జూన్ నెలలో దేవాస్ మల్టీమీడియా ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని ఆశ్రయించింది. 2015 సెప్టెంబరులో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఇస్రో వాణిజ్య విభాగాన్ని 672 మిలియన్ డాలర్లు దేవాస్ మల్టీమీడియాకు చెల్లించాలని కోరింది. ఈ నిర్ణయం ఆధారంగా దేవాస్ విదేశీ వాటాదారులు రికవరీ కోసం కెనడా అలాగే అమెరికాతో సహా చాలా దేశాలలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. అందులో భాగంగానే పారిస్ కోర్టులో వారికి అనుకూలంగా వచ్చింది. (చదవండి: ఇండియాలో టెస్లా కార్ల విడుదలపై ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్..!) -
దేవాస్‌కు 8,939 కోట్లివ్వండి
వాషింగ్టన్: శాటిలైట్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ దేవాస్ మల్టీమీడియాకు రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు) నష్ట పరిహారం చెల్లించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగమైన యాంట్రిక్స్ కార్పొరేషన్‌ను అమెరికా న్యాయస్థానం ఆదేశించింది. 2005 జనవరిలో ఈ ఒప్పందం కుదిరింది. 70 మెగాహెట్జ్ ఎస్–బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను దేవాస్ మల్టీమీడియాకు అందించేందుకు రెండు ఉపగ్రహాలను నిర్మించి, ప్రయోగించి, నిర్వహిస్తామని యాంట్రిక్స్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. అయితే, ఒప్పందం మేరకు స్పెక్ట్రమ్‌ను దేవాస్‌కు ఇవ్వడంలో యాంట్రిక్స్ కార్పొరేషన్ విఫలమైంది. 2011 ఫిబ్రవరిలో ఒప్పందాన్ని యాంట్రిక్స్ రద్దు చేసింది. అనంతరం దేవాస్ భారత్‌లో పలు కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసింది. తమకు న్యాయం చేయాలని విన్నవించింది. సరైన స్పందన లేకపోవడంతో 2018లో అమెరికాలోని వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వాషింగ్టన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి థామస్ ఎస్.జిల్లీ అక్టోబర్ 27న ఉత్తర్వు జారీ చేశారు. దేవాస్ సంస్థకు 562.5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని, ఇప్పటిదాకా వడ్డీతో కలిపి రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్ డాలర్లు)ను దేవాస్ మల్టీమీడియాకు చెల్లించాలని యాంట్రిక్స్ కార్పొరేషన్‌కు తేల్చిచెప్పారు. -
ఆంట్రిక్స్కు చుక్కెదురు.. దేవాస్ ‘భారీ’ విజయం
వాషింగ్టన్ : ఇస్రో భాగస్వామి ఆంట్రిక్స్ కార్పోరేషన్‌పై దేవాస్ మల్టీమీడియా లిమిటెడ్ ఎట్టకేలకు విజయం సాధించింది. 2005 శాటిలైట్ ఒప్పందం రద్దు చేసుకున్నందుకు గానూ 1.2 బిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని యూఎస్ కోర్టు ఆంట్రిక్స్ను ఆదేశించింది. 2005 జనవరిలో రెండు శాటిలైట్ల తయారీ, ప్రయోగం, ఆపరేషన్స్‌కు సంబంధించి ఆంట్రిక్స్.. దేవాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2011 ఫిబ్రవరిలో దేవాస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆంట్రిక్స్ ప్రకటించింది. ( ఫ్యూచర్ మహమ్మారులు మరింత డేంజర్..!) దీంతో దేవాస్ న్యాయ పోరాటం మొదలుపెట్టింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్రిబ్యునల్ ఏర్పాటుకు కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2018 సెప్టెంబర్‌లో అమెరికన్ కోర్టును ఆశ్రయించింది. వాషింగ్టన్ న్యాయస్థానం ఈ నెల అక్టోబర్ 27న కేసుపై విచారణ జరిపి తుది తీర్పును వెలువరించింది. ఆంట్రిక్స్ కార్పోరేషన్ దేవాస్ మల్టీమీడియాకు 562.5 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించాలని, వడ్డీతో కలిపి 1.2 బిలియన్ డాలర్ల చెల్లించాలని ఆదేశించింది. -
‘ఇస్రో యాంత్రిక్స్’పై హ్యాకర్ల దాడి
చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారని ఆదివారం సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జె.ప్రసన్న వెల్లడించారు. 2 రోజుల క్రితం వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారని, దీంతో యాంత్రిక్స్ తన వెబ్‌సైట్‌ను నిలిపివేసిందన్నారు. హ్యాకింగ్‌లో చైనా హ్యాకర్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. 2011లోనూ ఈ వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడిచేసినా.. ఆ కంపెనీ సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదన్నారు. వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తున్నామని, వార్షిక నివేదికలను అప్లోడ్ చేస్తామని శుక్రవారం యాంత్రిక్స్ చైర్మన్ వీఎస్ హెగ్డే వెల్లడించారు.