హెచ్‌పీ.. వాయిస్ ట్యాబ్లెట్‌లు వస్తున్నాయ్ | Hewlett-Packard to launch voice tablets in India | Sakshi
Sakshi News home page

హెచ్‌పీ.. వాయిస్ ట్యాబ్లెట్‌లు వస్తున్నాయ్

Published Fri, Jan 17 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

హెచ్‌పీ.. వాయిస్ ట్యాబ్లెట్‌లు వస్తున్నాయ్

హెచ్‌పీ.. వాయిస్ ట్యాబ్లెట్‌లు వస్తున్నాయ్

వాషింగ్టన్: పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ హ్యులెట్-ప్యాకార్డ్ భారత వినియోగదారుల కోసం వినూత్నమైన వాయిస్ ట్యాబ్లెట్‌లను అందిస్తోంది. 6,7 అంగుళాల స్క్రీన్‌లు ఉన్న ఈ వాయిస్ ట్యాబ్లెట్‌లు- హెచ్‌పీ స్లేట్ 6, హెచ్‌పీ స్లేట్ 7లను వచ్చే నెలలో భారత్‌లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేసే ఈ డివైస్‌లను పవర్‌ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో రూపొందించామని తెలిపింది. 3జీ, డ్యుయల్ సిమ్, డ్యుయల్ స్టాండ్‌బై, రియర్, ఫ్రంట్ కెమెరా  ఫీచర్లున్న ఈ వాయిస్ ట్యాబ్లెట్‌లను మల్టీ టాస్కింగ్ చేసే యూజర్ల కోసం అందిస్తున్నామని పేర్కొంది. కాగా మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్‌ల ఫీచర్లున్న డివైస్‌ల కోసం వినియోగదారులు చూస్తున్నారని, వాయిస్ ట్యాబ్లెట్‌ల మార్కెట్ జోరుకు ఇదే చోదక శక్తి కానుందని హెచ్‌పీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ గ్రూప్) రాన్ కాఫ్‌లిన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement