Hewlett-Packard
-
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్టాప్స్ ఏవంటే..!
కరోనా రాకతో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కంపెనీలకు కాసుల వర్షం కురిసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులతో పలు ల్యాప్‌ట్యాప్ కంపెనీలు గణనీయమైన అమ్మకాలను చూశాయి. దేశవ్యాప్తంగా జూలై నుంచి సెప్టెంబర్(క్యూ 3) త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లు బలమైన వృద్ధిని సాధించాయి. మూడు నెలల్లో సుమారు 4.5 మిలియన్ల యూనిట్లను పలు ల్యాప్‌టాప్ కంపెనీలు షిప్పింగ్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అధికంగా వృద్ధిని సాధించాయి. ►ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం... ఈ ఏడాది క్యూ3లో భారత్‌లో ఎక్కువగా అమ్ముడైన ల్యాప్‌టాప్‌లో హెచ్‌పీ 28.5 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో దాదాపు 1.3 మిలియన్ల యూనిట్ల కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. హెచ్‌పీ సుమారు 31.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ►డెల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో నిలిచింది. పర్సనల్ కంప్యూటర్ కేటగిరీలో క్యూ3లో 23.8 శాతం వాటాను డెల్ సొంతం చేసుకుంది.లెనోవోను అధిగమించి 45 శాతం వృద్దిను డెల్ సాధించింది. ►2021 క్యూ3లో లెనోవో మొత్తంగా 18.6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కొనసాగించింది. గత సంవత్సరంతో పోలిస్తే లెనోవో ల్యాప్టాప్స్ షిప్మెంట్లు 11.5 శాతం వృద్ధి చెందాయి. ►ఏసర్ 8.6 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో నిలవగా....గత సంవత్సరం ఎగుమతులలో పోలిస్తే 16.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో దాదాపు 3.8 లక్షల యూనిట్లకు చేరుకుంది. ►మరో వైపు ఆసుస్ ఈ ఏడాది క్యూ3లో 8.5 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో ఉండగా... భారత్‌లో మొదటిసారిగా 3 లక్షల పర్సనల్ కంప్యూటర్లను షిప్పింగ్ చేసింది. ►యాపిల్ లాంట్ దిగ్గజ కంపెనీ కూడా ఈ ఏడాది క్యూ3లో సుమారు 12 శాతం మేర వాటాను దక్కించుకున్నాయి. ►సరఫరా, లాజిస్టికల్ సవాళ్లు పలు కంపెనీలకు వేధిస్తున్నప్పటికీ ఆయా కంపెనీలు ఈ త్రైమాసికంలో గణనీయంగానే వృద్ధిని సాధించాయి. పర్సనల్ కంప్యూటర్స్‌లో నోట్‌బుక్ ల్యాప్‌టాప్ సుమారు 80 శాతం మేర కొనుగోలు జరిగాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్లు 16.5 శాతంగా నిలిచాయి. -
రెండు సంస్థలుగా టెక్ దిగ్గజం హెచ్‌పీ
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం హ్యూలెట్ ప్యాకార్డ్(హెచ్‌పీ) రెండు సంస్థలుగా విడిపోనుంది. పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటింగ్ బిజినెస్లతోకూడిన యూనిట్ ఒక సంస్థగానూ, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్ సర్వీసుల బిజినెస్‌లు మరో కంపెనీగానూ ఏర్పాటుకానున్నాయి. ఫార్చూన్ 50లో భాగంకానున్న ఈ రెండు సంస్థలూ విడిగా లిస్టింగ్కానున్నాయి. పర్సనల్ కంప్యూటర్స్, ప్రింటింగ్ విభాగాల యూనిట్‌కు ప్రస్తుత హెచ్‌పీ పేరు(లోగో)తో కొనసాగనుంది. ఎంటర్ప్రైజ్, సాఫ్ట్వేర్ సర్వీసుల విభాగాన్ని హ్యూలెట్ ప్యాకార్డ్ ఎంటర్ప్రైజ్ పేరుతో నిర్వహించనుంది. ఈ వివరాలను కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2015 చివరికల్లా పూర్తికానున్న విభజనలో భాగంగా వాటాదారులకు రెండు కంపెనీల షేర్లనూ కేటాయించనున్నారు. కాగా, ఐదేళ్ల పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా గతంలో 45,000 ఉద్యోగాల కోతను కంపెనీ ప్రకటించింది. అయితే కంపెనీ విభజన నేపథ్యంలో మరో 10,000 వరకూ అదనపు ఉద్యోగాల కోతకు తెరలే వనున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. వెరసి మొత్తం 55,000 మంది వరకూ ఉద్యోగాలను కోల్పోయే అవకాశమున్నట్లు కంపెనీ భావిస్తోంది. -
హెచ్‌పీ.. వాయిస్ ట్యాబ్లెట్లు వస్తున్నాయ్
వాషింగ్టన్: పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ హ్యులెట్-ప్యాకార్డ్ భారత వినియోగదారుల కోసం వినూత్నమైన వాయిస్ ట్యాబ్లెట్లను అందిస్తోంది. 6,7 అంగుళాల స్క్రీన్లు ఉన్న ఈ వాయిస్ ట్యాబ్లెట్లు- హెచ్‌పీ స్లేట్ 6, హెచ్‌పీ స్లేట్ 7లను వచ్చే నెలలో భారత్‌లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేసే ఈ డివైస్‌లను పవర్ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో రూపొందించామని తెలిపింది. 3జీ, డ్యుయల్ సిమ్, డ్యుయల్ స్టాండ్‌బై, రియర్, ఫ్రంట్ కెమెరా ఫీచర్లున్న ఈ వాయిస్ ట్యాబ్లెట్లను మల్టీ టాస్కింగ్ చేసే యూజర్ల కోసం అందిస్తున్నామని పేర్కొంది. కాగా మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్ల ఫీచర్లున్న డివైస్ల కోసం వినియోగదారులు చూస్తున్నారని, వాయిస్ ట్యాబ్లెట్ల మార్కెట్ జోరుకు ఇదే చోదక శక్తి కానుందని హెచ్‌పీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(కన్సూమర్ పర్సనల్ సిస్టమ్స్ గ్రూప్) రాన్ కాఫ్లిన్ పేర్కొన్నారు.