హైదరాబాద్: హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి రిసెప్షనిస్ట్ గా మారారు. ఈ నెల 27న వరంగల్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహణ ఖర్చులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూలి పనులు చేసి సంపాదించాలని పార్టీ నిర్ణయించడంతో నాయిని ఈ పనికి పూనుకున్నారు. ఇందుకుగానూ ఆయనకు రూ.2 లక్షల కూలి దక్కింది.
మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని ఓమెగా క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చిన నాయిని.. యాజమాన్యం సూచన మేరకు రిసెప్షన్‌లోకి వెళ్లి ఫైల్స్ అందజేయడమే కాకుండా రోగులు, వారి సహాయకులకు కావాల్సిన సమాచారాన్ని చేరవేశారు. బిల్లులను కూడా పరిశీలించారు. అనంతరం రూ.2లక్షల కూలి తీసుకొని వెళ్లిపోయారు. ఆయన వెంట బంజారాహిల్స్ కార్పొరేటర్లు గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ నియోజక వర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
రిసెప్షనిస్టు మంత్రికి రూ.2లక్షల కూలి
Published Tue, Apr 18 2017 8:11 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
Advertisement