TRS rally
-
జాతీయ సమైక్యత ర్యాలీలో అపశ్రుతి
మంచిర్యాల టౌన్/మిర్యాలగూడ అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎండలోనే ఉండటం, తాగునీరు సరిపడా లేక ఇబ్బందులు పడ్డారు. అనంతరం మండుటెండలో ర్యాలీని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు 3 కిలోమీటర్లు నిర్వహించారు. భోజనాలు కూడా ఎండలోనే మైదానంలో కింద కూర్చుని తిన్నారు. కనీసం తాగునీరు అందక, నీడ లేక 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 21 మందికి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించగా, మిగతా 9 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎల్ఈడీ స్క్రీన్ కూలి గాయాలు సమైక్యత వారోత్సవాల్లో భాగంగా మిర్యాలగూడలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎన్ఎస్పీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో కూర్చున్న స్థానిక కాకతీయ పాఠశాల విద్యార్థినులపై ఎల్ఈడీ స్క్రీన్ కూలిపోయింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన విద్యార్థినులకు చికిత్స అందించారు. ఇదీ చదవండి: ‘జయహో జగదీశన్న’.. ఆ జిల్లా ఎస్పీ నినాదం వివాదాస్పదం! -
రిసెప్షనిస్టు మంత్రికి రూ.2లక్షల కూలి
హైదరాబాద్: హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి రిసెప్షనిస్ట్ గా మారారు. ఈ నెల 27న వరంగల్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణ ఖర్చులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూలి పనులు చేసి సంపాదించాలని పార్టీ నిర్ణయించడంతో నాయిని ఈ పనికి పూనుకున్నారు. ఇందుకుగానూ ఆయనకు రూ.2 లక్షల కూలి దక్కింది. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని ఓమెగా క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చిన నాయిని.. యాజమాన్యం సూచన మేరకు రిసెప్షన్‌లోకి వెళ్లి ఫైల్స్ అందజేయడమే కాకుండా రోగులు, వారి సహాయకులకు కావాల్సిన సమాచారాన్ని చేరవేశారు. బిల్లులను కూడా పరిశీలించారు. అనంతరం రూ.2లక్షల కూలి తీసుకొని వెళ్లిపోయారు. ఆయన వెంట బంజారాహిల్స్ కార్పొరేటర్లు గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ నియోజక వర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
రేపు పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ ఈ సభలో పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారని సమాచారం. అయితే ఈ సభ ఏర్పాట్లను తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నేటి మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్స్‌లో దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జనవరి 31తో ముగియనుంది. రేపు సాయంత్రం 4.00 గంటలకు టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది.