కీలక పోస్టులు వారికే.. యోగి క్లారిటీ! | honest officials to hold key posts, says cm yogi | Sakshi
Sakshi News home page

కీలక పోస్టులు వారికే.. యోగి క్లారిటీ!

Published Sat, Apr 1 2017 4:53 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

కీలక పోస్టులు వారికే.. యోగి క్లారిటీ! - Sakshi

కీలక పోస్టులు వారికే.. యోగి క్లారిటీ!

లక్నో: నిజాయితీపరులైన అధికారులకే తన ప్రభుత్వంలో కీలక పోస్టులు.. గౌరవం, ప్రోత్సాహం దక్కుతాయని ఉత్తరప్రదేశ్‌ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. యూపీ సీఎం పగ్గాలు చేపట్టిన నాటినుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన.. అవినీతిపై ఉక్కుపాదం మోపడమే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తరహాలోనే యూపీలోని బీజేపీ సర్కారు అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పారు.

'అవినీతి నిరోధానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రభుత్వ విభాగాల పనితీరులోనూ, పథకాల అమలులోనూ పారదర్శకత తీసుకువస్తాం' అని సీఎం యోగి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తన మంత్రివర్గ సహచరులంతా నిజాయితీపరులైన అధికారులనే నియమించుకోవాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పారదర్శకతతో పనిచేయాలని ఆయన సూచించినట్టు అధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement