భూమికి భారీ పగుళ్లు..! | Huge 'crack in the earth' opens up in US mountains | Sakshi
Sakshi News home page

భూమికి భారీ పగుళ్లు..!

Published Sat, Oct 31 2015 5:48 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

భూమికి భారీ పగుళ్లు..! - Sakshi

భూమికి భారీ పగుళ్లు..!

అమెరికాలోని కొండ ప్రాంతాల్లో భారీ పగుళ్లు వచ్చాయి. వ్యోమింగ్స్ బైఘర్న్ పర్వత సానువుల్లో 15 రోజుల కిందట తలెత్తిన ఈ భారీ పగుళ్లను తాజాగా గుర్తించారు. ఈ పగుళ్లకు సంబంధించిన ఫొటోలను మొదట ఎస్‌ఎన్‌ఎస్ ఔట్‌ఫిటర్స్ అండ్ గైడ్ సర్విస్ సంస్థ ప్రచురించింది. 750 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో ఏర్పడిన ఈ పగుళ్లు.. చూడటానికి అబ్బురపరుస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. ఈ భారీ పగుళ్ల వెనుక పెద్ద మిస్టిరియస్ కారణాలు ఏమీ లేవని నిపుణులు చెబుతుండగా.. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

వానాకాలం కారణంగా క్యాప్ రాక్ పర్వతాలు మెత్తబడి.. చీలిక వచ్చి ఉంటుందని.. ఈ ప్రదేశాన్ని సందర్శించిన ఎస్ఎన్ఎస్ ఇంజినీర్ ఒకరు తెలిపారు. కొండచరియలు నెమ్మదిగా కదలడం వల్ల పర్వతాల మధ్య ఈ భారీ చీలిక ఏర్పడి ఉంటుందని, దాదాపు 15 నుంచి 20 మిలియన్ అడుగుల మేర కొండచరియలు కదిలి ఉంటాయని భూగర్భ పరిశోధక సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement