కాలిఫోర్నియా: పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడి ఇంట్లో పాముల సంతే బయటపడింది. వందలకొద్దీ పాములు, చుంచులు, ఎలుకలతో చిట్టడవిని తలపించే ఆ ఇంటిని చూసి పోలీసులే హడలిపోయారు. కాలిఫోర్నియా శివార్లలోని ఓ ఇంట్లో నివసించే బుచ్‌మెన్ వత్తిరిత్యా ఉపాధ్యాయుడు. కొన్నాళ్లుగా ఆయన ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కలవారంతా పోలీసులకు సమాచారం అందించారు. ఇంటిలోపలికి వెళ్లి తనిఖీచేసిన పోలీసులు అక్కడ చచ్చిపోయిన పాములు, వెన్నులో వణకు పుట్టించే కొండచిలువలను చూసి భయపడిపోయారు.
ఆ ఇంట్లోని నాలుగురూంలలో ఇంటిపైకప్పు నుంచి గదిలోపలివరకూ ప్లాస్టిక్ డబ్బాలలో వందలకొద్దీ పాములను నిల్వచేసినట్లు గుర్తించారు. 350 వరకు పాములను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పనిలోపనిగా జంతువులను సంరక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రించారని బుచ్‌మెన్‌ను అరెస్టు చేశారు. అయితే తాను పాముల పునరుత్పత్తికి సంబంధించిన వ్యాపారంలో భాగంగానే ఇదంతా చేసినట్లు బచ్‌మెన్ చెప్పుకొచ్చాడు.