pythons found in home
-
చెప్పు తిని దొరికిపోయింది...!!
పెర్త్, ఆస్ట్రేలియా : దాదాపు పది అడుగుల పొడవాటి ఓ కొండ చిలువ (పైథాన్) ఇంట్లోకి ప్రవేశించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన సోమవారం పెర్త్‌లోని మౌంట్ ఒమానెయ్లో చోటుచేసుకుంది. దానిని పట్టుకునేందుకు స్థానికంగా ఉండే పాములు పట్టే వ్యక్తికి సమాచారమివ్వగా.. అతను వచ్చేసరికే పాము చెట్టు కొమ్మల్లోకి చేరింది. అయితే ఎలాగోలా దాన్ని పట్టుకున్న ఆ వ్యక్తి దాని కడుపులో ఏదో వస్తువుందని గ్రహించి వెటర్నరీ ఆస్పత్రి హెర్ప్ వెట్‌కు తరలించాడు. ఆ పైథాన్‌ను స్కాన్ చేయగా దాని కడుపులో చెప్పు ఉందని తేలింది. సర్జరీ చేసి దాని పొట్టలో నుంచి చెప్పును తొలగించారు. ఆపరేషన్ జరిగిన తీరును వీడియో తీసి వైద్యుడు జాన్ లీనాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. కావాలంటే మీరూ చూడొచ్చు. -
చెప్పు తిని దొరికిపోయింది...చివరికి!
-
నట్టింట్లో 'పాముల'సంత!
కాలిఫోర్నియా: పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడి ఇంట్లో పాముల సంతే బయటపడింది. వందలకొద్దీ పాములు, చుంచులు, ఎలుకలతో చిట్టడవిని తలపించే ఆ ఇంటిని చూసి పోలీసులే హడలిపోయారు. కాలిఫోర్నియా శివార్లలోని ఓ ఇంట్లో నివసించే బుచ్మెన్ వత్తిరిత్యా ఉపాధ్యాయుడు. కొన్నాళ్లుగా ఆయన ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కలవారంతా పోలీసులకు సమాచారం అందించారు. ఇంటిలోపలికి వెళ్లి తనిఖీచేసిన పోలీసులు అక్కడ చచ్చిపోయిన పాములు, వెన్నులో వణకు పుట్టించే కొండచిలువలను చూసి భయపడిపోయారు. ఆ ఇంట్లోని నాలుగురూంలలో ఇంటిపైకప్పు నుంచి గదిలోపలివరకూ ప్లాస్టిక్ డబ్బాలలో వందలకొద్దీ పాములను నిల్వచేసినట్లు గుర్తించారు. 350 వరకు పాములను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పనిలోపనిగా జంతువులను సంరక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రించారని బుచ్మెన్ను అరెస్టు చేశారు. అయితే తాను పాముల పునరుత్పత్తికి సంబంధించిన వ్యాపారంలో భాగంగానే ఇదంతా చేసినట్లు బచ్మెన్ చెప్పుకొచ్చాడు.