రాహుల్ హైదరాబాద్ కార్యక్రమాలు రద్దు | hyderabad programmes of rahul gandhi cancelled | Sakshi
Sakshi News home page

రాహుల్ హైదరాబాద్ కార్యక్రమాలు రద్దు

Published Thu, May 14 2015 12:38 PM | Last Updated on Wed, Sep 19 2018 8:17 PM

రాహుల్ హైదరాబాద్ కార్యక్రమాలు రద్దు - Sakshi

రాహుల్ హైదరాబాద్ కార్యక్రమాలు రద్దు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యక్రమంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో ఆయన పర్యటన రద్దయింది. ముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని ప్రత్యేక విమానంలో నాందేడ్ వెళ్లనున్న రాహుల్.. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలోనే ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తారు. అక్కడే శుక్రవారం నాడు ఆయన 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. చివరి నిమిషంలో ఈ మార్పుల విషయం తెలిసింది.

అయితే, రాహుల్ గాంధీ వస్తారన్న అంచనాతో ముందునుంచి హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఆయనకు స్వాగత సన్నాహాలు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన వెళ్లే మార్గమంతా గురువారం ఉదయం నుంచే భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీ యువరాజుకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు గట్టిగానే చేసుకున్నారు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆయన కార్యక్రమం మారడంతో ఇవన్నీ వృథా అయిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement