
చలపతి వ్యాఖ్యలపై నాగార్జున స్పందన
హైదరాబాద్: చలపతిరావు వ్యాఖ్యల దుమారంపై టాలీవుడ్ సీనియర్ హీరో, రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాత నాగార్జున స్పందించారు. అమ్మాయిలపై చలపతిరావు వల్గర్ కామెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. చలపతిరావు అగౌరవ వ్యాఖ్యల్ని ఖండించారు. తన వ్యక్తిగత జీవితంలోనూ, తన సినిమాల్లోనూ మహిళల పట్ల గౌరవం ఉందంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
మరోవైపు అసలు ఈ వివాదానికి కారణమైన ’’అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’’ అన్న వ్యాఖ్యపైనే పలువురు మేధావులు, రచయిత్రులు, మహిళా సంఘాల నేతలు, ఇతర పెద్దలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరి ఈ అభ్యంతరాలపై నాగ్, లేదా ఈ సినిమా హీరో నాగ చైతన్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
I always respect women personally and in my films/I definitely do not agree wt Chalapati rao's derogatory comments/dinosaurs do not exist!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) 23 May 2017