chalapathi
-
గెరిల్లా సేనాని చలపతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చిత్తూరు అర్బన్/ మల్కన్‌గిరి: వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్‌రెడ్డి అలియాస్ అప్పారావు మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఇలా ఎన్కౌంటర్లో మృతిచెందడం మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. చలపతిపై రూ.కోటి రివార్డు ఉన్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించి... ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం పైపల్లెకు చెందిన శివలింగారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల మూడో కుమారుడు చలపతి. ఆయన తండ్రి సాధారణ రైతు. వారికి మత్యం పైపల్లెలో ఇప్పటికీ సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో చలపతి అన్న కుమారుడి కుటుంబం నివసిస్తోంది. ప్రాథమిక విద్యను మత్యంలోనే అభ్యసించిన చలపతి.. పదో తరగతి వరకు బంగారుపాళెం, డిగ్రీ ఒకేషనల్ కోర్సును చిత్తూరులో పూర్తిచేశారు. పీపుల్స్‌వార్ పార్టీకి ఆకర్షితుడై 1990–91లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసు రికార్డుల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మావోయిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారు. శ్రీకాకుళం– కోరాపుట్ డివిజన్ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన.. గెరిల్లా వార్ఫేర్లో చూపిన ప్రతిభతో అనతి కాలంలోనే డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 2000 నాటికి ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ, ఏవోబీ స్టేట్ మిలిటరీ కమిషన్లలో సభ్యుడి హోదా పొందారు. 2010లో తోటి మావోయిస్టు అరుణ అలియాస్ చైతన్యను వివాహం చేసుకున్నారు. 2012లో జరిగిన ఒక దాడిలో చలపతి పొరపాటు కారణంగా ఒక కామ్రేడ్ చనిపోవడంతో పార్టీ ఆయనను కొంతకాలం డీమోట్ చేసింది. చలపతి భార్య అరుణ 2019 మార్చిలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతి చెందారు. మహేంద్ర కర్మపై దాడితో మళ్లీ తెరపైకి... సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై 2015లో చేసిన దాడితో చలపతి మరోసారి వెలుగులోకి వచ్చారు. తరా>్వత మావోయిస్టు రీజనల్ కమిటీ చీఫ్ కుడుముల వెంకట రమణ అలియాస్ రవి ఎదురుకాల్పుల్లో మృతి చెందడం, గెమ్మెలి నారాయణరావు అలియాస్ జాంబ్రి 2017లో చనిపోవడంతో.. చలపతికి ప్రాధాన్యత దక్కింది. తర్వాతి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. 2003లో దమాన్జోడి మైన్స్ కంపెనీపై దాడి, మాచ్‌ఖండ్ పోలీసుస్టేషన్‌పై దాడి, చిత్రకొండ సమితిలో సెల్ టవర్ల పేల్చివేత, 2009లో ఏపీ గ్రేహౌండ్స్‌పై చిత్రకొండ జలాశయంలో దాడి, 2018లో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యను ప్లాన్ చేసినది చలపతేనని చెబుతారు. 2011లో చలపతి ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కలెక్టర్ వినీల్‌కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆర్కే సన్నిహితుడిగా.. హిడ్మాకు గురువుగా.. మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్స్‌లో ఒకరిగా చలపతికి గుర్తింపు ఉంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు అత్యంత సన్నిహితంగా చలపతి మెలిగారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్‌గా ఉన్న మడావి హిడ్మాకు చలపతిని గురువుగా పేర్కొంటారు. ఆయన ఎలా ఉంటారనేది చాలా కాలం పాటు పోలీసులకు తెలియలేదు. 2016లో ఓ మావోయిస్టు చనిపోగా.. అతడి ల్యాప్‌టాప్‌లో చలపతి, ఆయన సహచరి అరుణ సెల్ఫీ వీడియో లభించింది. -
గౌడ జాతి అభ్యున్నతికి ప్రభుత్వ చర్యలు అభినందనీయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్లుగీత వృత్తికి ఊపిరి పోసేలా ప్రభుత్వ కొత్త గీత విధానం ఉందని, గీత వృత్తిదారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కౌండిన్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు చెప్పారు. చలపాటి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని పాతపాడులో సీఎం వైఎస్ జగన్‌కు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ గీత కార్మికులు మోకు మోస్తాదులతో కృతజ్ఞత ప్రదర్శన నిర్వహించారు. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం సెంటర్లో సీఎం జగన్, మంత్రి జోగి రమేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చలపాటి మాట్లాడుతూ కొత్తగా వైఎస్సార్ గీత కార్మిక భరోసా పథకాన్ని ప్రకటించడంతో పాటు.. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గౌడ జాతి అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు వీరంకి రామచంద్రరావు, నగర నాయకుడు మాదు సాంబశివరావు, పాతపాడు ఎంపీటీసీ సభ్యుడు మరీదు బాలకోటేశ్వరరావు, సంఘ నాయకులు బెజవాడ ఏడుకొండలు, పలగాని రాంబాయి, పామర్తి శ్రీనివాసరావు, ఆరేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గబ్బర్ సింగ్ ట్యాక్స్.. అరె ఓ సాంబా.. ఇంకా ఏం వదిలినమో రాసుకోరా!
ఉచితంగా విద్యుత్, రెండు గ్యాస్ సిలిండర్లు, కాలేజీ అమ్మాయిలకు టూ వీలర్స్ ఇస్తాం.. ఇది బీజేపీ మొన్నటి ఎన్నికల హామీ తీయని మిఠాయిల మాదిరి ఉచితాల ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతి చాలా ప్రమాదకరం.. ఇది నిన్నటి మోదీ మాట ఈ రెండు వాక్యాలకు పుట్టినిల్లు ఉత్తరప్రదేశే.. ఈ రెండు వాక్యాల మధ్య ఏజ్ గ్యాప్ ఐదు నెలలు మాత్రమే.ఇంత తక్కువ వ్యవధిలోనే మాట, మూడ్ మారిపోతుందా? ఒక్కోసారి అంతే.. ఈ కథ చదవండి పాత కథే.. అనగనగా ఒక ఊర్లో ఒకాయన ఉన్నారు. ఆయనకు అత్యవసరంగా ఓ పని పడింది. ఆ పని అయితే ఊర్లో ఉన్న ఇల్లు అమ్మి ప్రజలందరికీ ఫ్రీగా డబ్బు కానీ, బహుమతి కానీ ఇస్తానని రాములోరికి మొక్కుకున్నాడు. ఇంత మంచి ఆలోచనను దేవుడు కాదంటాడా.. తథాస్తు అన్నాడు.. పనైపోయింది.. ఆల్ హ్యాపీస్. కానీ ఇక ఫ్రీగా ఇచ్చే టైం వచ్చింది. మాటైతే ఇచ్చాడు.. కానీ ఫ్రీగా ఇవ్వటానికి మనసు రావడం లేదు. ఉత్తి పుణ్యానికి ఇల్లమ్మి అందరికీ ఇవ్వాలా అని మథన పడసాగాడు. కానీ రాములోరి మొక్కు కదా తప్పదు.. ఎలా అని ఆలోచించగా మనోడికి పొలిటికల్ లీడర్ లెవెల్లో ఓ ఐడియా వెలిగింది. ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ధర ఒక్క రూపాయి మాత్రమేనని ఎనౌన్స్ చేశాడు.. కానీ, తన పిల్లిని కొంటేనే ఇల్లు అమ్ముతానని షరతు పెట్టాడు.. పిల్లి ధర రూ.25000 అన్నాడు. వేలం నడిచింది.. ఇల్లు అమ్ముడుపోయింది. ఇంటి మీద వచ్చిన ఒక్క రూపాయిని మాత్రం ఫ్రీగా పంచేశాడు. రాముడికి మాటిచ్చింది అదే కదా.. న్యాయం ప్రకారం పిల్లికి వచ్చిన డబ్బులు పంచక్కర్లేదు. అవి జేబులో వేసుకున్నాడు. ఇది చదివి ఉచిత హామీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ జాగా అమ్మకాలు అని ఏవేవో అన్వయించుకోకండి.. ఊరికే ఓ కథ అంతే.. పంజాబ్‌లో ‘ఉచిత విద్యుత్’అచ్చొచ్చిన కేజ్రివాల్ ఇప్పుడు చీపురు పట్టుకొని గుజరాత్లో తిరుగుతున్నాడు.. ‘ 300 యూనిట్ల ఫ్రీ పవర్’ అంటూ. అందుకే మన పెద్దమనిషి మోదీకి ఉచితాలపై చిర్రెత్తుకొస్తోందని ఓ టాక్.. అవును.. ఇప్పుడు పన్నులు మాత్రమే ‘ఉచితం.’ఎన్ని కావాలంటే అన్ని, దేనిమీద కావాలంటే దానిమీద వేసుకోవచ్చు. కావాల్సినంత ఫ్రీగా. దేశానికేం ప్రమాదం లేదు. ‘డబుల్’ఇంజన్ల భారం.. ‘ఉచితాల’సంగతి సరే గానీ తక్కువ ధరల్లో మా బతుకు నడవనీయండి.. ‘డబుల్ ఇంజన్లు’(ఒకటి మోదీ ది.. మరొకటి కేసీఆర్ ది) లాగలేక పోతున్నామని జనం గోల. బండి ఎక్కితే మోదీ.. బస్సు ఎక్కితే కేసీఆర్.. గ్యాస్ ఆన్ చేస్తే మోదీ, కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే కేసీఆర్ గుర్తుకు వస్తున్నారు. (కరెంటు, డీజిల్, బస్ చార్జీలతో..) ఇక మన నిర్మలా సీతారామన్ అయితే నట్టింట్లో.. ఇంకా చెప్పాలంటే వంటింట్లో కూడా మనతో తిరుగుతున్నట్టుగా ఉంటుంది.. పప్పు, ఉప్పు, పెరుగు, బియ్యం.. ఇలా ఏం టచ్ చేసిన ఆమె గుర్తుకొస్తున్నారు. జీఎస్టీ రుచి తెలుస్తోంది .. ‘‘ఈ డబుల్ ఇంజన్లు మన బతుకు బండిని లాగుతున్నాయా.. మనమే మన బతుకు బండితో పాటు ఈ డబుల్ ఇంజన్లను లాగుతున్నామా?’’.. అని మిడిల్ క్లాసులో ఓ ప్రశ్న. అచ్చం కిరాణా దుకాణంలా.. ఇప్పుడు గడ్కరీకి రాజకీయాలపై విరక్తి పుట్టినట్టే.. ఓ జర్నలిస్టు మిత్రుడికి తన ఉద్యోగంపై ఆసక్తి పోయింది. కిరాణా షాపు పెట్టుకుని బతుకుదాం అనుకున్నాడు. తెలిసిన ఒక సీనియర్ షావుకారు దగ్గరికి వెళ్లి ఒపీనియన్ అడిగాం. ఆయన మమ్మల్ని కిందా మీదా చూసి.. ఏం అమ్మితే ఎంత పర్సంటేజ్ వస్తుందో, ఏయే సరుకుల్లో ఎంత మిగులుతుందో తెలుసా? అని అడిగారు. మా వెర్రి ముఖాలు చూసి ఆయనే సమాధానం చెప్పారు. ఓవరాల్ 13–14% వరకు మిగిలే కిరాణా వ్యాపారంలో చిన్న చిన్న వస్తువులు.. ఆవాలు, జీలకర్రలాంటి చిన్న చిన్న సరుకులపై 20% మిగులుతుందని చెప్పాడు.. వాటితో పాటు ఎక్కువ పర్సంటేజ్ మిగిలే వస్తువుల లిస్టు చకచకా వల్లెవేశాడు. లూజుగా అమ్మితే ఎంత, ముందే ప్యాక్ చేసి పెట్టుకుంటే ఎంత టైమ్, డబ్బులు మిగులుతాయో చెప్పారు. పాలు, పెరుగు అమ్మితే ఎంత మిగులుతుందో.. 5 నుంచి 20 శాతం మార్జిన్లలో ఉన్న సరుకుల లిస్టు చెప్పేశారు. కిరాణా వెనుక ఇంత గణాంకాల గొడవ ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు.. ఇంతకీ కిరాణా షాప్ పెట్టాడో లేదో మీకు తెలిసే ఉంటుంది. వాడే.. తాజాగా ఫోన్ చేసి ‘మన షావుకారును నిర్మలా సీతారామన్ ఏమైనా కలిసిందేమిట్రా’అని ఫోన్ చేశాడు. రకరకాల వస్తువులపై ఆమె వేసిన జీఎస్టీ లిస్ట్ షేర్ చేశాడు. పెరుగు, లస్సీ, బట్టర్ మిల్క్, పనీర్, బెల్లం, తేనె, చక్కెర, బియ్యం, గోధుమలు, మరమరాలు.. ఇలా ఏ ఆహార పదార్థాన్ని వదలకుండా అనేక వస్తువులపై ఐదు శాతం జీఎస్టీ వేసేశారు.. ప్యాక్ చేస్తే చాలు బ్రాండెడ్ కానక్కర్లేదు.. అన్ బ్రాండెడ్ అయినా సరే. (..ఇలాంటివే 80 శాతం ఇండియన్లు కొంటారని ఓ అంచనా) ‘‘అంటే నిర్మలమ్మకు డబ్బులు ఎక్కడినుంచి రాబట్టాలో, ఎలా కిరాణా కొట్టు నడపాలో బాగా తెలుసన్నమాట. మన షావుకారు లాగే’’ అని జోకేశాడు. శ్మశానంతో సహా.. ఎక్కడా తగ్గలే.. ఫోర్క్‌లు, కత్తులు, పెన్సిల్ షార్పెనర్లు.. ఇలా ఒక్కటీ వదలలేదు.. 12 నుంచి 18 శాతం జీఎస్టీ బాదేశారు.. ఇల్లంతా తిరుగుతూ ఉంటే నిర్మలమ్మ టచ్ చేయని ఒక్క వస్తువూ ఇంట్లో కనిపించడం లేదు. ఎల్ఈడీ లైట్స్ పై కూడా 18శాతం.. గోడకు వేలాడే పిల్లలు చదువుకునే చార్టుల నుంచి అట్లాసుల దాకా 12శాతం వేసేశారు. చివరికి బ్యాంకు చెక్కులకు చెల్లించే డబ్బులపైన 18 శాతం జీఎస్టీ ఉంది. డైమండ్స్ పై 1.5 శాతం,బంగారంపై 3 శా తం హాస్పిటల్ బెడ్స్ రూ.5,000 దాటితే, హోటల్ రూమ్ రెంట్ రూ.1,000 దాటితే 5శాతం.. చివరికి శ్మశాన సేవల్ని కూడా 18 శాతానికి పెంచారు.. సోషల్ మీడియా.. పాలిటిక్స్ ఇంత బాదినా గుంతల్లో పడిన హైదరాబాదీలాగా కిందా మీదా పడి బతుకును నడిపేస్తున్నారేగానీ.. ఒక్కరూ నోరు తెరవడం లేదు. గతంలో డీజిల్ పావలా పెరిగితే.. సిలిండర్ రూపాయి పెరిగితే.. కరెంటు చార్జీలు పెంచుతారని తెలిస్తే చాలు ధర్నాలు, కేకలూ వినపడేవి. పక్కన కాసిన్ని ఎర్ర జెండాలు కనిపించే సరికి యువ రక్తం పొంగి బస్సు అద్దాలపై నాలుగు రాళ్లు పడేవి.. ఇప్పుడు అదేం లేదు. పైగా మన ఆక్రోశాన్ని ఏ ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్ లోనో పోస్ట్ చేద్దామంటే ఆ ‘నాలుగు రాళ్లు’మనపై పడుతున్నాయి. ‘ఏందీ అన్యాయం.. గ్యాసు ధర, డీజిల్ ఇలా పెరిగితే ఎలా బతకడం.. తినే ప్రతిదానిపైనా జీఎస్టీ అంటే ఎలా..’అని అంటే చాలు. వందల కామెంట్స్ విరుచుకుపడుతున్నాయి. ‘కేసీఆర్ పెంచిన బస్సు రేట్లతో సామాన్యులపై ఎక్కువ భారం పడుతోంది తెలుసా’అని రోజువారీ లెక్కలు వేసి నెలకు ఎంత ఖర్చవుతుందో చెప్తున్నారు. కరెంట్ బిల్లులు షేర్ చేస్తున్నారు. మనను కేసీఆర్ టీమ్‌లో కలిపేస్తున్నారు. ‘అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కౌన్సిలే కదా జీఎస్టీ పెంచేది.. మీ సీఎం మీ ఆర్థిక మంత్రులు ఏం చేస్తున్నారు?’అని ప్రశ్నిస్తున్నారు. పోనీ కరెంటు చార్జీలపై, బస్సు చార్జీలపై క్వశ్చన్ చేస్తే.. ‘జీఎస్టీ ధరలు పోస్ట్ చేసి మోదీ ఏం చేశాడో చూశారా..?’అంటూ కాసిన్ని బూతులు కలిపి, డీజిల్ చార్జీలు, పెట్రోల్ చార్జీలు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని చూపుతూ విరుచుకుపడుతున్నారు. మనను మోదీ టీమ్‌లోనో, బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న వాడిలాగానో చూస్తున్నారు. కేంద్రం బాదినా, రాష్ట్రం బాదినా మోగేది మన మన వీపే కదా.. అంటే వినేదేలే.. ఇంకోటుంది.. ‘భారతీయుడి’టైప్ సెక్షన్. పన్నుల గురించి చర్చ చేస్తే చాలు.. ‘‘అసలు పన్నుల్లేకుండా దేశాన్ని నడపడం ఎట్లా?.. శ్రీలంక లాగా మన దేశాన్ని దిగజారుస్తారా? రూ.500 పెట్టి సినిమాకు వెళ్తారు గానీ, వంద పెట్టి పెట్రోల్ పోయించుకోలేరా?’’అని వెటకారాలు గుమ్మరిస్తున్నారు. నెటిజన్లు రాజకీయ వర్గాలుగా డివైడ్ అవుతున్నారా? రాజకీయ వర్గాలే సోషల్ మీడియాను ఆపరేట్ చేస్తున్నాయా?.. ఇదో డౌట్.. ఇదంతా ఎందుకనీ.. ఈ కడుపు మంటని మీమ్స్ లాగా, జోక్స్ లాగా షేర్ చేసుకుని ఏడవలేక నవ్వుతున్నారు. అన్నట్టు ఇప్పుడు జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌గా సోషల్‌మీడియాలో హల్చల్ అవుతోంది. ఇది బాగుంది.. జీఎస్టీ ధమ్ బిర్యానీ జీఎస్టీ ధమ్ బిర్యానీ అట. నెట్లో హల్చల్ చేస్తోంది.. ‘‘12 శాతం జీఎస్టీ పెట్టి కొన్న పాత్రలో.. 5 శాతం జీఎస్టీ వేసిన ప్యాకేజ్డ్ చికెన్, పెరుగు, కారం, మసాలాలు వేసి.. ప్రస్తుతానికి జీఎస్టీ లేని ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. దాన్ని 28 శాతం జీఎస్టీ పెట్టి కొన్ని ఫ్రిడ్జ్ లో అరగంట పెట్టాలి. తర్వాత 18శాతం జీఎస్టీ చెల్లించి కొన్న స్టవ్‌ను 12 శాతం జీఎస్టీతో కొన్న అగ్గిపెట్టెతో వెలిగించి.. 12 శాతం జీఎస్టీ వేసిన అల్యూమినియం పాత్ర పెట్టాలి. ఫ్రీగా వచ్చే నీళ్లు, జీఎస్టీ లేని హోల్ స్పైసెస్ వేసి.. 5శాతం జీఎస్టీ బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. ప్రస్తుతం బేగంబజార్‌లో జీఎస్టీ లేకుండా దొరుకుతున్న బిర్యానీ పాత్ర తెచ్చుకుని.. అడుగున 12 శాతం జీఎస్టీ ఉన్న బట్టర్ ను రాసి, ముందే రకరకాల జీఎస్టీ లెక్కలతో సిద్ధమైన చికెన్ ముక్కలను, ఆపై బాస్మతి రైస్‌ను వేసుకోవాలి. చివరిగా 5 శాతం జీఎస్టీ ఉన్న మైదాతో ‘ధమ్’పెట్టి.. బిర్యానీ సిద్ధం చేసుకోవాలి.’’అని.. మరొకటి ఏంటంటే.. ‘ఈ వంటంతా రూ.1,150 పెట్టి తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ మీద చేసుకోవాలి..’ ఓ నెటిజన్ ఆవేదన చూడండి.. ‘పల్మోరిక్స్ట్ అనే టాబ్లెట్ జీఎస్టీకి ముందు రూ.1,100 కు వచ్చేది. ఇప్పుడు రూ.1,370 అవుతోంది. అప్పట్లో బిల్లు నెలకు రూ. 7,000 అయ్యేది. ఇప్పుడు రూ..10,000 అవుతోంది. ఈ ట్యాబ్లెట్లు మింగకపోతే చస్తావని డాక్టర్లు అంటున్నారు.. ఇది నాకు భారమే కదా..’ -
అయ్యప్ప కటాక్షంతో...
సుమన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. ఎ. జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ల, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ ముఖ్యపాత్రధారులు. రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. నటుడు సుమన్ కెరీర్లో ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు కథ,స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు అందించిన వి.యస్.పి. తెన్నేటి, టి.ఎస్. బద్రీష్ రామ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా పూర్తి కావాలంటే అద్భుతాలు జరగాలంటుంటారు. అలాంటివి ఈ సినిమాకు జరిగాయి. అయ్యప్పకటాక్షం వల్లే ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నామనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇరవై ఏళ్లకు పైగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాను. అయ్యప్ప దీక్ష ఎలా చేయాలి? అయ్యప్ప దీక్ష చేసేవారు నలుపు రంగు దుస్తులే ఎందుకు వేసుకోవాలి? కాషాయ రంగు వస్త్రాలు ధరించి కూడా దీక్ష చేయవచ్చా? ఎలా క్రమశిక్షణగా ఉండాలి? అనే ఇలాంటి చాలా అంశాలకు ఈ సినిమాలో వివరణలు ఇచ్చాం’’ అన్నారు వి.యస్. పి. తెన్నేటి. -
మీనాను హత్య చేసింది గ్రేహౌండ్స్ పోలీసులే
-
చలపతే.. యాక్షన్ దళపతి!
ఆపరేషన్ లివిటిపుట్టులో మావోయిస్టు కీలకనేత చలపతి పాల్గొన్నారా?.. ఆయనే స్వయంగా ఆపరేషన్‌ను పర్యవేక్షించారా??.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దీనికి అవుననే సమాధానం లభిస్తోంది. గత నెల 23న జరిగిన ఈ హత్యాకాండలో మహిళా మావోయిస్టు నేత అరుణ ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారని.. మిలటరీ కమిషన్ ఆధ్వర్యంలో చలపతి వ్యూహం రచించినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. అయితే లోతుగా జరిగిన సిట్ విచారణలో చలపతి పాత్ర స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా హత్యాకాండలో పాల్గొనకపోయినా.. దళంతో కలిసి వచ్చి కాస్త దూరంగా ఉండి పర్యవేక్షించారని సమాచారం. మరోవైపు మీడియాను వెంట తీసుకెళితే మావోయిస్టులు దాడికి పాల్పడరన్న వ్యూహంతోనే కిడారి తన కాన్వాయ్ వెంట మీడియా ప్రతినిధులను తీసుకెళ్లినా.. అది ఫలించలేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యోదంతంపై సిట్ జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో గత నెల 23న మావో యిస్టులు వారిద్దరినీ దారుణంగా కాల్చిచంపిన ఘటనలోమావోయిస్టు మహిళా నేత అరుణ కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాజాగా ఆమె భర్త, మావోయిస్టు కీలక నేత చలపతి కూడా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు సిట్ అధికారులు తేల్చారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆదేశాలతో చలపతి దగ్గరుండి ఆపరేషన్ విజయవంతం చేసినట్టు తెలుస్తోంది. కాల్పుల పనిని మహిళా మావోలకు అప్పజెప్పి చలపతి మాత్రం కాస్త దూరంలోనే నిలబడినట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. చలపతి, అరుణల నాయకత్వంలో ఆ రోజు ఉదయమే నందాపూర్ కమిటీకి చెందిన సుమారు 30మంది మావోయిస్టులు లివిటిపుట్టు చేరుకున్నారు. అక్కడకు మరో ముప్పై మంది మిలీషియా సభ్యులు చేరుకున్న తర్వాత ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ఏజెన్సీ టీడీపీ నేతలే ఉప్పందించారు.. కిడారికి సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలే మావోలకు ఉప్పందించారని సిట్ అధికారులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చినట్టు తెలుస్తోంది. అయితే కిడారి వెన్నంటి తిరిగిన టీడీపీ నేతలు ఒక్కసారిగా మావోలతో కుమ్మక్కై ఎందుకు పక్కాగా సమాచారం అందించారన్న దానిపై మాత్రం సిట్ అధికారులకు స్పష్టత రాలేదు. వ్యాపార లావాదేవీల్లో అంతర్గత విభేదాలా.. పార్టీ ఫిరాయించిన తర్వాత టీడీపీలోని ఓ వర్గంతో వచ్చిన అంతరాలా.. అన్నది ఇప్పటికీ తేలలేదని అంటున్నారు. మొత్తానికి ఏజెన్సీకి చెందిన, కిడారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన టీడీపీ నేతలే మావోలకు ఎప్పటికప్పుడు ఆయన కదలికలపై సమాచారం ఇచ్చినట్టు మాత్రం సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మీడియా ప్రతినిధుల సాక్షిగానే... ఆ రోజు కిడారి మీడియా వారిని తన వెంట తీసుకువెళ్లడం వాస్తవమేనని సిట్ తేల్చింది. మీడియా ప్రతినిధులు ఉంటే దాడికి మావోయిస్టులు వెనుకంజ వేస్తారన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కిడారి వారిని వెంటబెట్టుకు వెళ్లారని అంటున్నారు. ఓ ప్రధాన పత్రిక విలేకరితోపాటు ముగ్గురు స్థానిక విలేకరులు ఆయన్ను అనుసరించారని తెలుస్తోంది. ఆయన కారుకు ముందు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు విలేకరులు, కారు వెనుక మరో టూవీలర్‌పై ఇద్దరు విలేకరులు అనుసరించారు. కిడారి వాహనానికి ముందున్న విలేకరులు అక్కడ మావోలు కాపుకాయడం చూసి తమ బండి ఆపకుండా వెళ్ళిపోయారు. కిడారి వాహనం వెనుక అనుసరిస్తున్న ఇద్దరు మీడియా విలేకరులను మాత్రం మావోలు అడ్డగించినట్టు తెలిసింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు వారిని అక్కడే కూర్చోబెట్టి ఆ తర్వాతే వదిలిపెట్టినట్టు చెబుతున్నారు. దీంతో సిట్ అధికారులు సదరు విలేకరులను విచారించినట్టు తెలిసింది. కాగా, ఆ రోజు ఆపరేషన్‌లో లివిటిపుట్టు గ్రామస్తుల పాత్ర ఏమీ లేదని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు. సిట్ నివేదికను సర్కారు బయటపెడుతుందా? స్వయంగా అధికార తెలుగుదేశం నేతలే దగ్గరుండి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిలను కాల్చి చంపించిన వ్యవహారాన్ని ఎలా బయటపెట్టాలో తెలియక సిట్ అధికారులు మధనపడుతున్నారు. కారణాలు ఏమైనా కానీ టీడీపీ నేతలు అందించిన సమాచారంతోనే మావోలు పక్కా వ్యూహంతో మెరపుదాడి చేయగలిగారు. సిట్ దర్యాప్తులో ఈ విషయం స్పష్టమైంది. అయితే వాస్తవ నివేదిక బయటపెడితే సర్కారు తీరు ఎలా ఉంటుందోనన్న ఆందోళన విచారణ అధికారులను వెంటాడుతోంది. అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం విచారణ కొనసాగిస్తామని, ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో సిట్ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని సిట్ వర్గాలు వెల్లడించాయి. -
శివుడి మహిమ
పరమశివుడి కథాంశంతో ఇప్పటి వరకూ పలు చిత్రాలొచ్చాయి. తాజాగా ‘శివ ప్రళయం’ పేరుతో మరో సినిమా రూపొందుతోంది. అభిమన్యుసింగ్, సుమన్, చలపతిరావు, తనాశ్రీ, ‘తాగుబోతు’ రమేశ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఏ. చౌదరి దర్శకత్వంలో శ్రీపాద నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శ్రీపాద మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. ఈ షెడ్యూల్లో అభిమన్యుసింగ్, సుమన్, తనుశ్రీల మధ్య గ్రాఫిక్స్ సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నా. ఈనెల 12నుంచి గోవాలో జరిగే షెడ్యూల్‌తో క్లయిమాక్స్ పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘శివుడిపై సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు ఎం.ఏ.చౌదరి. ధన్‌రాజ్, అజయ్ నాని, సత్యప్రకాశ్, పృథ్వీరాజ్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: మహి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.రవికుమార్. -
వర్ధమాన నటిపై లైంగిక వేధింపులు
-
వర్ధమాన నటిపై లైంగిక వేధింపులు
విజయవాడ: విజయవాడ సమీపంలో నిడమానూరు వద్ద ఓ వర్ధమాన నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తనకు సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇస్తామని హైదరాబాద్‌కు చెందిన వర్ధమాన దర్శకుడు చలపతి, వర్ధమాన హీరో సృజన్‌లు ఆశ కల్పించి తన కారులో హైదరాబాద్ నుంచి భీమవరం తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ముందు సీట్లో కూర్చున్న తనపై దర్శకుడు చలపతితో పాటు హీరో సృజన్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు. గొడవ జరుగుతుండగా తన కారు పక్కనే వెళుతున్న ఓ లారీని ఢీకొందని తెలిపారు. గాయాలకు గురైన తనను విజయవాడలో ఓ ప్రైవేట్ ఆస్పతిలో చేర్పించారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. నిందితుడు చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్ధమాన హీరోగా చెబుతున్న సృజన్ పరారీలో ఉన్నాడు. -
చిక్కుల్లో నటుడు చలపతి
-
నేనేమీ బెదిరిపోను..నేను చాలా గట్టివాడ్ని
-
చలపతి వ్యాఖ్యలపై నాగార్జున స్పందన
హైదరాబాద్: చలపతిరావు వ్యాఖ్యల దుమారంపై టాలీవుడ్ సీనియర్ హీరో, రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాత నాగార్జున స్పందించారు. అమ్మాయిలపై చలపతిరావు వల్గర్ కామెంట్లపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. చలపతిరావు అగౌరవ వ్యాఖ్యల్ని ఖండించారు. తన వ్యక్తిగత జీవితంలోనూ, తన సినిమాల్లోనూ మహిళల పట్ల గౌరవం ఉందంటూ నాగార్జున ట్వీట్ చేశారు. మరోవైపు అసలు ఈ వివాదానికి కారణమైన ’’అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’’ అన్న వ్యాఖ్యపైనే పలువురు మేధావులు, రచయిత్రులు, మహిళా సంఘాల నేతలు, ఇతర పెద్దలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరి ఈ అభ్యంతరాలపై నాగ్, లేదా ఈ సినిమా హీరో నాగ చైతన్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. I always respect women personally and in my films/I definitely do not agree wt Chalapati rao's derogatory comments/dinosaurs do not exist!! — Nagarjuna Akkineni (@iamnagarjuna) 23 May 2017 -
నేనేమీ బెదిరిపోను..నేను చాలా గట్టివాడ్ని
హైదరాబాద్: తన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారంపై చలపతి సోషల్ మీడియాలో స్పందించారు. నారీలోకానికి నమస్కారం మంటూ తన ఫేస్బుక్ లైవ్‌ను మొదలుపెట్టారు. తన వ్యాఖ్యలకు డబుల్ మీనింగ్ తీసుకున్నారంటూ దాటవేత వైఖరిని తీసుకున్నారు. అంతేకాదు తనకు మహిళలపట్ల గౌరవం ఉందనీ, మహిళల పట్ల అవమానకరంగా వున్న యాంకర్ ప్రశ్నకు చాలా నిజాయితీగా, కోపంగా మాట్లాడాను తప్ప వేరే ఏమీ కాదంటూ చెప్పుకొచ్చారు. ఆడవాళ్లు హానికరం అనే ఆ మాట అడగవచ్చా అని ఆయన ప్రశ్నిచారు. అలా అంటే ఒక్క మగాడు కానీ, మహిళ కానీ ఖండించలేదన్నారు. అందుకే తాను అలా స్పందించానన్నారు. అంతేకాదు మీరు హర్ట్ అయి ఉంటే.. సారీ అంటూనే నేనేమీ బెదిరిపోను.. నేను చాలా గట్టివాడినంటూ వ్యాఖ్యానించడం విశేషం. నా విజయం వెనుక నా భార్య ఉంది. 40ఏళ్ల క్రితం నా భార్య చనిపోయింది.. అయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా.. వేరే మహిళవైపు చూడకుండా సంసారాన్ని దిద్దుకొచ్చాను. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది. జై మహిళా లోకం అంటూ డ్యామేజ్ కంట్రోల్ పనిలో పడ్డారు. -
చిక్కుల్లో నటుడు చలపతి
హైదరాబాద్: అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావుకు చుక్కెదురైంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా చలపతిరావు చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం రేగింది. సోషల్ మీడియాలో ఆయనపై పలువురు మేధావులు, రచయిత్రులు, మహిళా నాయకులు మండిపడుతున్నారు. మహిళల గౌరవానికి భంగకరంగా, వెకిలిగా మాట్లాడిన ఆయనపై మహిళా సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ మేరకు నటుడు చలపతిరావుపై జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన లో ఫిర్యాదు చేశాయి. భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్త దేవి తదితరులు పోలీసులకు తమ ఫిర్యాదును అందించారు. మహిళలనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రమదాక్షరీ ఉమెన్ రైటర్స్ ఫేస్ బుక్ గ్రూప్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్లో అమ్మాయిలు మానసిక ప్రశాంతతకు హానికరమా అని యాంకర్ ప్రశ్నించినపుడు చలపతిరావు అమ్మాయిలపై చాలా అవమానకరంగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఆడియో ఫంక్షన్లో నటుడి వెకిలి కూతలు
-
ఆడియో ఫంక్షన్లో సీనియర్ నటుడి వెకిలి కూతలు
హైదరాబాద్: నాగచైతన్య హీరోగా వస్తోన్న 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ వేడుకలో ఈ పెద్దాయన అనుచిత వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. విలక్షణ నటన, విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకున్న చలపతి వెకిలి మాటలపై దుమారం రేగుతోంది. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన చలపతిరావులాంటి పరిశ్రమ పెద్దలు అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడడం తగదని కమెంట్ చేస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్షన్లో ముందు వరుసలో కూర్చున్న చలపతినుద్దేశించి అమ్మాయిల మనశ్శాంతికి హానికరమా అని యాంకర్ ప్రశ్నించినపుడు చలపతి ఇచ్చిన సమాధానంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. రాయడానికి కూడా మనస్కరించని రీతిలో చెలరేగిపోయాడు. దీంతో తలపండిన ఈ సీనియర్ నటుడి వల్గర్ కమెంట్లపై విస్తుపోయారు. -
అనంతలో దారుణం
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త అనుమానం పెనుభూతమైంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో గొడవపడి కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అనంతపురంలో మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. - అనంతపురం సెంట్రల్ నగరంలోని వినాయక్‌నగర్‌లో చలపతి, సుమతి(34) దంపతులు నివసిస్తున్నారు. వీరికి హేమలత(14), మానస (11), రాఘవేంద్ర (8) సంతానం. చలపతి పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబంలో కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త అనుమానించాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరూ గొడవపడ్డారు. సుమతి పుట్టింటి వారికి కూడా తెలియజేసి మందలించినట్లు సమాచారం. ఒకానొక సమయంలో బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలో ఉన్న తమ సొంత ఇంటికి మకాం మార్చాలని భావించాడు. అయితే పిల్లల చదువు దృష్ట్యా విరమించుకున్నాడు. మంగళవారం ఉదయం మరోసారి వివాహేతర విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన చలపతి ఇంట్లో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తి తీసుకొని గొంతుకోసి హతమార్చాడు. అనంతరం పారిపోయాడు. ఉదయాన్నే ఈ ఘటన జరగడంతో వినాయక్‌నగర్‌లో కలకలం రేగింది. కాలనీలోని ప్రజలు పెద్ద ఎత్తున ఆ ఇంటివద్ద గుమిగూడారు. వన్‌టౌన్ సీఐ రాఘవన్, ఎస్ఐలు రంగయాదవ్, నాగమధులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడు చలపతి సాయంత్రానికి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. -
చలపతి.. అరుణ..ఓ సెల్ఫీ
ఫొటో వెలుగులోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్కౌంటర్ సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలంగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న కోరాపుట్-శ్రీకాకుళం డివిజినల్ కమిటీకి డిప్యూటీ కమాండర్‌గా వ్యవహరించిన చలపతి, ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పని చేసిన ఆయన భార్య అరుణ తాజా ఫొటోలు ‘సెల్ఫీ’ ద్వారానే పోలీసులకు చిక్కాయి! సోమవారం ఏవోబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 24 మందిలో వీరిద్దరూ ఉన్నారు. చలపతి తలపై రూ.20 లక్షలు, అరుణపై రూ.5 లక్షల రివార్డు ఉంది. వారి తాజా ఫొటోల కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ కారణంగానే భార్యాభర్తలు ఇద్దరూ పలు సందర్భాల్లో ఏజెన్సీ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరగగలిగారు. అప్పట్లో వీరి కదలికలపై సమాచారం ఉన్నా.. గుర్తింపు సమస్య వల్లే పోలీసుల బలగాలు ఏమీ చేయలేకపోయాయి. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగించినట్లు అనుమానిస్తున్న చలపతి ఓ సందర్భంలో తన భార్యతో కలిసి దట్టమైన అటవీ ప్రాంతంలో సెల్ఫీ దిగాడు. దీన్ని అరుణ సోదరుడైన ఆజాద్ తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుచుకున్నాడు. ఈ ఏడాది మే 4న విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం మర్రిపాకలు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు కిట్ బ్యాగ్, ఆయుధాలతోపాటు ల్యాప్‌టాప్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌ను విశ్లేషించిన పోలీసు వర్గాలకు ఈ సెల్ఫీ లభించింది. దీని ఆధారంగా భారీ సంఖ్యలో చలపతి, అరుణ పోస్టర్లు ముద్రించి పోలీసులు ఏజెన్సీ మొత్తం ప్రచారం చేశారు. దీంతో షాక్‌కు గురైన మావోయిస్టు కేంద్ర కమిటీ స్మార్ట్ ఫోన్ల వినియోగం, సెల్ఫీలు సహా ఫొటోలు తీసుకోవడంపై దాదాపు నిషేధం విధించింది. రెండు దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చలపతి, అరుణల సెల్ఫీ వెలుగులోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్కౌంటర్ అయ్యారు. సోమవారం ఎన్కౌంటర్ స్థలంలో వీరిద్దరినీ గుర్తిచడంలోనూ ఈ సెల్ఫీనే కీలక ఆధారంగా మారినట్టు సమాచారం. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
లింగాల (వైఎస్సార్ జిల్లా): అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని పెదకుడాల గ్రామానికి చెందిన మంజుల, చలపతి (40)కి వ్యవసాయంలో రూ. 10 లక్షల అప్పు అయింది. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో చలపతి పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రౌడీషీటర్ హత్య
పంతాలు, పట్టింపులు, ఆత్మరక్షణ ధోరణిలోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ప్రధాన నిందితుడు నిందితులందరిపై రౌడీషీట్లు మదనపల్లెక్రైం: పంతాలు, పట్టింపులు, ఆత్మరక్షణ ధోరణిలోనే రౌడీషీటర్ చలపతిని ఆరుగురు యువకులు హత్య చేశారని మదనపల్లె డీఎస్పీ కే.రాఘవరెడ్డి తెలిపారు. ఐదుగురు నిందితులను మంగళవారం స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చూపారు. డీఎస్పీ కే.రాఘవరెడ్డి, సీఐ సీఎం.గంగయ్య కథనం మేరకు.. చంద్రాకాలనీకి చెందిన పూల చలపతి, నీరుగట్టువారిపల్లెకు చెందిన ధనేశ్వర్‌రెడ్డి కొంతమంది నేత కార్మికులను పోగేసుకుని గ్యాంగులుగా తిరిగేవారు. మద్యం దుకాణాల వద్ద పలుమార్లు ఘర్షణలు పడ్డారు. నీరుగట్టువారిపల్లెకు చెందిన రామిశెట్టికిషోర్(23), జంగాలపల్లెకు చెందిన సురవరపు అమర్నాథ్ అలియాస్ అమర(25), కాట్లాటపల్లెకు చెందిన గంగాధర్(19), పెద్దమండ్యం మండలం నక్కలవారికోటకు చెందిన మల్లికార్జున(24), బి.కొత్తకోట మండలం కొత్తపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి అలియాస్ మెస్ సూరి(25) నీరుగట్టువారిపల్లె పరిసర ప్రాంతాల్లో రూములు అద్దెకు తీసుకుని మగ్గాలు నేసుకుంటూ ధనేశ్వర్‌రెడ్డితో తిరిగేవారు. ధనేశ్వర్‌రెడ్డికి, హతుడు పూల చలపతికి గతంలో గొడవలు ఉన్నాయి. రెండు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న పూల చలపతి రెండుసార్లు కిషోర్, అమర, గంగాధర్, మల్లికార్జున, మెస్ సూరిలను కొట్టాడు. ధనేశ్వర్‌రెడ్డితో తిరగడం మానేసి తనతోనే తిరగాలని వార్నింగ్ ఇచ్చాడు. అయినా అందరూ ధనేశ్వర్రెడ్డితోనే ఉండడంతో వినాయకచవితి లోపు మీరందరూ ఊరు వదిలి వెళ్లిపోవాలని, లేదంటే నా చేతుల్లో అయిపోయినట్లేనని చలపతి వారిని బెదిరించాడు. దీంతో ధనేశ్వర్‌రెడ్డితో కలిసి ఐదుగురు పథకం పన్నారు. పూల చలపతిని వదిలేస్తే మనమే ఇబ్బందుల్లో పడతామని మాట్లాడుకు న్నారు. ఈ క్రమంలో ధనేశ్వర్‌రెడ్డితో గొడవపడినట్లు మెస్ సూరి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి చలపతిని నమ్మించాడు. ధనేశ్వర్‌రెడ్డితో విడిపోయానని, ఇక నీతోనే ఉంటానని చలపతి జతచేరాడు. వారం రోజులుగా చలపతితోనే తిరుగుతూ అతని ప్రతి కదలికనూ ధనేశ్వర్‌రెడ్డికి చేరవేశాడు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీ రాత్రి చలపతి రింగ్ రోడ్డులోని మద్యం దుకాణానికి వచ్చి ఒంటరిగా వెళుతున్నాడని ధనేశ్వర్‌రెడ్డికి మెస్ సూరి ఫోన్‌చేసి చెప్పడంతో పథకం ప్రకారం అందరూ ఒక్కటయ్యారు. రెండు ద్విచక్ర వాహనాల్లో చలపతిని వెంబడించి కళ్లలో కారం కొట్టి వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. సర్కారు తోపు వద్ద నిందితులు ఉండడంతో పట్టుకుని విచారించారు. తమను చంపేస్తాడేమోనన్న భయంతో తామే అతన్ని హతమార్చినట్లు ఒప్పుకున్నారు. సూత్రధారి ధనేశ్వర్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. కిషోర్, అమర, మెస్ సూరి, గంగాధర్, మల్లికార్జునను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, కత్తి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించిన ఎస్ఐలు శ్రీనివాస్, హనుమంతప్ప, కానిస్టేబుళ్లు రాజేష్, రాకేష్, శ్రీకాంత్‌ను డీఎస్పీ అభినందించారు. -
బతుకు భారమై..
అప్పుల బాధ.. ఆపై వేధింపులు.. జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో రైతు ఆత్మహత్య ‘వ్యవసాయం చేసుకోని బతుకుతామంటే అప్పులెక్కువైపోయినాయి.. యాడేగాని అప్పు పుట్టలేదు. ఈ ఊళ్లో బతకలేం.. మీ అమ్మోళ్ల ఊరికైనా పోయి ఏదో ఒక పనిచేసుకుని బతుకుదాం పా.. అంటూ భార్యా బిడ్డలను వెంటేసుకుని ఊరొదిలి వచ్చిన ఆ బక్క రైతుకు కళ్లముందు కష్టాలే కనిపించాయి. అటు చూస్తే అప్పుల వాళ్లు.. ఇటు చూస్తే బిడ్డల ఆకలి.. చావే శరణ్యమనుకున్నాడు. ఇంటి నుంచి బయలుదేరిన ఆ రైతు భార్యా, బిడ్డలకు పుట్టెడు దుఃఖం మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. కడప అర్బన్: జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం మధ్యాహ్నం ఎ.చలపతి (35) అనే రైతు విషపు గుళికలు నీటిలో కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవితంపై విరక్తితో ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. మైలవరం మండలం బుగ్గదాసరిపల్లెకు చెందిన అయ్యలప్పల గారి చలపతి తన భార్య సుబ్బమ్మ అలియాస్ సుబ్బక్కతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తన తల్లి పేరుతో ఉన్న ఐదెకరాల భూమిని సాగు చేసుకుంటూ మరోవైపు బేల్దారి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి భావన (11), హర్షవర్ధన్ (9) పిల్లలున్నారు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తామంటే ఇప్పటికే అప్పుల పాలయ్యానని, మళ్లీ పొలాన్ని సాగు చేసేందుకు అవసరమైన డబ్బును అప్పుగా తీసుకుందామంటే ఎవరూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చే సేవాడు. ఈ పరిస్థితుల్లో బతుకు దెరువు కోసం తన భార్యా పిల్లలతో కలిసి తన అత్తగారి ఊరైన ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లెకు గత శనివారం వెళ్లాడు. అదే ఊరిలో బేల్దారి పనికి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. సోమవారం ఉదయం తాను పల్లెకు వెళ్లి పిల్లల పుస్తకాలు, ఇంటి సామగ్రి తీసుకొస్తానని భార్య సుబ్బమ్మతో చెప్పి వచ్చాడు. తాను కలెక్టర్ పేరుతో రాసుకున్న అర్జీని తీసుకుని నేరుగా కడపలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చి విషపు గుళికలు నీటిలో కలిపి తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడి పోలీసులు గమనించి క్లూస్ టీం వాహనంలో రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. వన్‌టౌన్ సీఐ మహబూబ్‌బాషా, ఎస్ఐ మైనుద్దీన్ రిమ్స్‌కు చేరుకుని ఆత్మహత్యకు దారితీసిన కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ మైనుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ చలపతి సోమవారం మధ్యాహ్నం కలెక్టర్, ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు హాజర య్యేందుకు వచ్చాడన్నారు. కానీ వారినెవరినీ కలవకుండానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలను సూసైడ్ నోట్లో రాశాడని తెలిపారు. మృతుడి భార్య ఏమన్నారంటే! ఈ సంఘటనపై చలపతి భార్య సుబ్బమ్మ అలియాస్ సుబ్బక్క విలేకరులతో మాట్లాడుతూ తన భర్త, పిల్లలు గత శనివారం అమ్మగారింటికి వెళ్లామన్నారు. తన భర్త ఊరిలో ఐదెకరాల పొలం సాగు చేసుకునేందుకు డబ్బులు కావాల్సి వచ్చి ఎవరినైనా అప్పు అడిగినా... ఇవ్వొద్దని వెంకటరాముడు అడ్డుపడేవాడని తెలిపారు. తాము ఇక్కడ బతకలేమని తన భర్త తరచూ అంటుండేవాడన్నారు. అందువల్లనే బతుకుదెరువు కోసం తమ పుట్టింటికి వెళ్లామన్నారు. ఊరికాడ పిల్లల పుస్తకాలు, ఇంటి సామగ్రి ఉందని, తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వచ్చిన తన భర్త తనకు దక్కకుండా పోయాడని విలపించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బీజేపీ ఇంటింటా ప్రచారం
కోలారు, న్యూస్‌లైన్ : బీజేపీ కార్యకర్తలు మంగళవారం నగరంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. నగరసభ సభ్యుడు మునేష్, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓం శక్తి చలపతి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా కార్యదర్శి ఓం శక్తి చలపతి మాట్లాడుతూ ... ఉత్తమ దేశ నిర్మాణం కోసం నరేంద్రమోడీని ప్రధాని చేయాలని, దీని కోసం బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కోలారు నుంచి ఈసారి బీజేపీ అభ్యర్థి నారాయణస్వామిని అత్యధిక మెజారిటీతో గెలిపించి లోక్‌సభకు పంపాలన్నారు. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన కేహెచ్‌మునియప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసింది శూన్యమన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నగర అధ్యక్షుడు జయంతిలాల్, జిల్లా సమితి నాయకులు ము రాఘవేంద్ర, నీలి జయశంకర్ తదితరులు ఉన్నారు.