విజయవాడ సమీపంలో నిడమానూరు వద్ద ఓ వర్ధమాన నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు ప్రకారం తనకు సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇస్తామని హైదరాబాద్‌కు చెందిన వర్ధమాన దర్శకుడు చలపతి, వర్ధమాన హీరో సుజన్‌లు ఆశ కల్పించి తన కారులో హైదరాబాద్ నుంచి భీమవరం తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ముందు సీట్లో కూర్చున్న తనపై దర్శకుడు చలపతితో పాటు హీరో సృజన్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు.