కోలారు, న్యూస్‌లైన్ : బీజేపీ కార్యకర్తలు మంగళవారం నగరంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. నగరసభ సభ్యుడు మునేష్, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓం శక్తి చలపతి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా కార్యదర్శి ఓం శక్తి చలపతి మాట్లాడుతూ ... ఉత్తమ దేశ నిర్మాణం కోసం నరేంద్రమోడీని ప్రధాని చేయాలని, దీని కోసం బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కోలారు నుంచి ఈసారి బీజేపీ అభ్యర్థి నారాయణస్వామిని అత్యధిక మెజారిటీతో గెలిపించి లోక్‌సభకు పంపాలన్నారు. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన కేహెచ్‌మునియప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసింది శూన్యమన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నగర అధ్యక్షుడు జయంతిలాల్, జిల్లా సమితి నాయకులు ము రాఘవేంద్ర, నీలి జయశంకర్ తదితరులు ఉన్నారు.
బీజేపీ ఇంటింటా ప్రచారం
Published Wed, Apr 9 2014 3:51 AM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM
Advertisement
Advertisement