లింగాల (వైఎస్సార్ జిల్లా): అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని పెదకుడాల గ్రామానికి చెందిన మంజుల, చలపతి (40)కి వ్యవసాయంలో రూ. 10 లక్షల అప్పు అయింది. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో చలపతి పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.