
పరమశివుడి కథాంశంతో ఇప్పటి వరకూ పలు చిత్రాలొచ్చాయి. తాజాగా ‘శివ ప్రళయం’ పేరుతో మరో సినిమా రూపొందుతోంది. అభిమన్యుసింగ్, సుమన్, చలపతిరావు, తనాశ్రీ, ‘తాగుబోతు’ రమేశ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఏ. చౌదరి దర్శకత్వంలో శ్రీపాద నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శ్రీపాద మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. ఈ షెడ్యూల్‌లో అభిమన్యుసింగ్, సుమన్, తనుశ్రీల మధ్య గ్రాఫిక్స్ సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నా.
ఈనెల 12నుంచి గోవాలో జరిగే షెడ్యూల్‌తో క్లయిమాక్స్ పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘శివుడిపై సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు ఎం.ఏ.చౌదరి. ధన్‌రాజ్, అజయ్ నాని, సత్యప్రకాశ్, పృథ్వీరాజ్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: మహి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.రవికుమార్.
Comments
Please login to add a commentAdd a comment