వర్ధమాన నటిపై లైంగిక వేధింపులు | director and hero rape attempt the woman | Sakshi
Sakshi News home page

వర్ధమాన నటిపై లైంగిక వేధింపులు

Published Wed, Aug 16 2017 5:15 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

వర్ధమాన నటిపై లైంగిక వేధింపులు - Sakshi

వర్ధమాన నటిపై లైంగిక వేధింపులు

విజయవాడ: విజయవాడ సమీపంలో నిడమానూరు వద్ద ఓ వర్ధమాన నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తనకు సినిమాలో హీరోయిన్‌ చాన్స్‌ ఇస్తామని హైదరాబాద్‌కు చెందిన వర్ధమాన దర్శకుడు చలపతి, వర్ధమాన హీరో సృజన్‌లు ఆశ కల్పించి తన కారులో హైదరాబాద్‌ నుంచి భీమవరం తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ముందు సీట్లో కూర్చున్న తనపై దర్శకుడు చలపతితో పాటు హీరో సృజన్‌ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు.

గొడవ జరుగుతుండగా తన కారు పక్కనే వెళుతున్న ఓ లారీని ఢీకొందని తెలిపారు. గాయాలకు గురైన తనను విజయవాడలో ఓ ప్రైవేట్‌ ఆస్పతిలో చేర్పించారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హైదరాబాద్‌ నుంచి వచ్చి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పారు. నిందితుడు చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్ధమాన హీరోగా చెబుతున్న సృజన్‌ పరారీలో ఉన్నాడు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement