నా దగ్గర అసలు డబ్బులే లేవు! | I have only 8-10 lakhs in bank, says radhe ma | Sakshi
Sakshi News home page

నా దగ్గర అసలు డబ్బులే లేవు!

Published Thu, Aug 13 2015 4:25 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

నా దగ్గర అసలు డబ్బులే లేవు!

నా దగ్గర అసలు డబ్బులే లేవు!

రాధే మా.. ఈ పేరుకు ఇప్పుడు పరిచయం అవసరం లేదు. ప్రత్యేకంగా హెలికాప్టర్ సమకూరిస్తేనే పెళ్లికి వస్తానని చెప్పిన సన్యాసిని! ప్రస్తుతం వరకట్న వేధింపుల కేసులో అరెస్టయి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. ఆమె సంపద గురించి, ఖరీదైన దుస్తులు, నగలంటే ఆమెకున్న మోజు గురించి కథలు కథలుగా అందరూ చెప్పుకొంటారు. ఆమె మేకప్ అయితే.. ఫొటోలలోను, వీడియోల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అలాంటి రాధే మా దగ్గర అసలు డబ్బుఏ లేవట. తన బ్యాంకు ఖాతాలో కేవలం 8-10 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని ఆమె చెబుతోంది.

మరి ఖరీదైన దుస్తులు, మేకప్ విషయం ఏంటని అడిగితే.. భక్తులు ఇచ్చిన దుస్తులే తాను వేసుకుంటానని, అలాగే తన మేకప్ కూడా భక్తులే చేస్తారని ఆమె సెలవిచ్చిందట. కుంభమేళాకు తనను రావొద్దంటూ నిషేధించినట్లు వచ్చిన కథనాలన్నీ అవాస్తవమని, తనపై ఎలాంటి నిషేధం లేదని కూడా చెప్పింది. తాను కావాలనుకుంటే నాసిక్ కుంభమేళాకు వెళ్లేదాన్నని, ఇంతకు ముందు కూడా చాలా కుంభమేళాలకు వెళ్లానని రాధే మా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement