11 ఏళ్ల అబ్బాయి 'పైలట్' కల తీరింది | IAF makes Thalassemia affected boy youngest honorary pilot | Sakshi
Sakshi News home page

11 ఏళ్ల అబ్బాయి 'పైలట్' కల తీరింది

Published Sat, Jul 11 2015 2:52 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

11 ఏళ్ల అబ్బాయి 'పైలట్' కల తీరింది

11 ఏళ్ల అబ్బాయి 'పైలట్' కల తీరింది

చెన్నై: తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల ముఖిలేష్కు పైలట్ కావాలన్నది జీవితాశయం. అతని ఆశయానికి అనారోగ్యం అడ్డుగా వచ్చింది. ముఖిలేష్ తలసేమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. ఓ ఎన్జీవో ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది.

ఐఏఎఫ్ ముఖిలేష్ను 'ఒక్క రోజుకు గౌరవ పైలట్'గా నియమించి అతడి కోరిక తీర్చింది.  కోయంబత్తూరులోని వైమానిక దళ బృందానికి ఈ బాధ్యతను అప్పగించింది. ముఖిలేష్కు స్క్వాడ్రన్ బ్యాడ్జి, క్యాప్ను బహూకరించారు. విమానంలో పైలట్ సీటులో కూర్చోబెట్టడంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అంతేగాక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ముఖేష్కు ఎయిర్ ఫోర్స్ అధికారులు సహకరించారు. ఈ విధంగా ముఖిలేష్కు పైలట్ కావాలన్న కల నెరవేరింది. ఐఏఎఫ్ నుంచి ఈ గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడే ముఖిలేషే. అనంతరం అతణ్ని చికిత్స కోసం కోయంబత్తూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement