ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీ ఈ ఏడాది అమెరికాలో 174 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. తమ అంతర్జాతీయ క్లయింట్ల డిమాండ్లను తీర్చడానికి ఉద్దేశించిన స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్)ఉద్యోగాల్లో భాగంగా ఈ నియామకాలు జరిపామని టీసీఎస్ సోమవారం తెలిపింది. వీరందరికీ సిన్సినాటిలో ఉన్న తమ సెంటర్‌లో టీసీఎస్ ఇనీషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద 6-12 వారాలు శిక్షణనిస్తామని పేర్కొంది. శిక్షణ పూర్తయిన తర్వాత వీరిలో వందమంది ఇదే సెంటర్‌లో ఉద్యోగాలు నిర్వహిస్తారని వివరించింది. మిగిలిన వారిని అమెరికావ్యాప్తంగా ఉన్న తమ సెంటర్లలో నియమిస్తామని పేర్కొంది. గత నాలుగేళ్లలో అమెరికాలో 500కు పైగా అత్యున్నత నైపుణ్యం గల కాలేజీ పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చామని వివరించింది. అమెరికాలోని 71 విభిన్న యూనివర్శిటీల నుంచి వీరిని ఎంపిక చేశామని తెలిపింది.
174మంది అమెరికన్లకు టీసీఎస్ ఉద్యోగాలు
Published Tue, Aug 6 2013 3:47 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
Advertisement
Advertisement