- రెవెన్యూ, పోలీస్,వైద్యారోగ్య శాఖల్లో ఎక్కువ..
- మంత్రివర్గ సమావేశంలోసీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అవినీతి రోజు రోజుకూ పెరిగిపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పలు శాఖల్లో అవినీతి పెరిగిపోతోందని ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో చెప్పిన చంద్రబాబు కేబినేట్‌లోనూ ఆ ప్రస్తావన తెచ్చారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ అవినీతిపై చర్చించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు... ప్రజలతో సంబంధం ఉండే రెవెన్యూ, పోలీస్ , వైద్య, ఆరోగ్య శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయా శాఖల మంత్రులు బాధ్యులైన అధికారులపై క ఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత త్వరగా అవినీతిని నియంత్రించామనే సందేశాన్ని ప్రజలకు పంపాలని సూచించారు. సమావేశంలో నూతన రాజధాని నిర్మాణం, బెరైటీస్ గనులు, ఆర్టీసీ చార్జీల పెంపు తదితరాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌పై అసంతృప్తి
రాజధాని నిర్మాణానికి ముందుగా నిర్వహించే ప్రచారం, ఈ నెల 22న జరిగే శంకుస్థాపన సందర్భంగా చేపట్టే కార్యక్రమాలపై మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై మంత్రివర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకునేలా ఉండాలని సూచించింది. సినిమా రంగానికి చెందిన నిపుణుల సలహాలు, సూచనలు, సహకారం తీసుకుని గ్రాఫిక్స్‌తో రూపొందించాలని చె ప్పింది.
పౌరసరఫరాల శాఖ గాడి తప్పింది..
పౌరసరఫరాల శాఖను ఐఏఎస్ అధికారి రాజశేఖర్ పర్యవేక్షించినపుడు గాడిలో పడిందని, ఇపుడు మళ్లీ గాడితప్పిందని ముఖ్యమంత్రి అన్నారు. వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. పరిస్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రితోపాటు అధికారులను ఆదేశించారు.
ఇసుక కొనలేక ఇబ్బందులు...
ప్రజలు ఇసుక కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీని ప్రభావం ప్రభుత్వంపై పడుతోందని సమవేశంలో పాల్గొన్న మంత్రులు చెప్పారు. ఇసుకను డ్వాక్రా మహిళల ద్వారా తక్కువ ధరకు అమ్మిస్తున్నా మార్కెట్‌లో మాత్రం నియంత్రణలో ఉండటం లేదన్నారు. వెంటనే ఇసుక ర్యాంపులను వేలం వేసి మహిళలకే ఇవ్వటం, జీపీఎస్ విధానం అవలంభించటం, కె మేరాలు ఏర్పాటు చేయటంతోపాటు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చాలన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో రైతులు కొనుగోలు చేసే చిన్న ట్రాక్టర్లకు 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు.
ఆ శాఖల్లో అవినీతి పెరిగిపోతోంది
Published Fri, Oct 2 2015 2:50 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement