ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: బీజేపీ | BJP MLC Somu Veerraju Sensational Allegation On Chandrababu Naidu And TDP | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: బీజేపీ

Published Sat, Mar 24 2018 10:29 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

BJP MLC Somu Veerraju Sensational Allegation On Chandrababu Naidu And TDP - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అది సాధ్యమయ్యే అవకాశమేలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మట్టి నుంచి ఇసుకదాకా, పోలవరం నుంచి పట్టిసీమ దాకా లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఆఖరికి బడిపిల్లల టాయిలెట్ల కోసం ఇచ్చిన నిధులను కూడా చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఆసాంతం నాకేశారని మండిపడ్డారు.

అరుణ్‌ జైట్లీ సూచించినట్లు ‘స్పెషల్‌ పర్పస్ వెహికల్’ ఏర్పాటు చేస్తే.. హోదా హామీ ద్వారా ఏపీకి దక్కాల్సిన అన్నిటికి అన్ని మేళ్లూ అందుతాయని, ఈ విషయంలో బీజేపీపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా లేరని, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన రాష్ట్రాన్ని బలిపెడుతున్నాడని పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మిత్రుడిపై భారీ స్థాయిలో విమర్శల బాంబులు పేల్చారు.

సర్వం అవినీతిమయం: ‘‘ఏపీ వరదాయిని పోలవరంతోపాటు పట్టిసీమ, రాయలసీమ ప్రాజెక్టులు అవినీతికి నిలయంగా మారాయని సోము వీర్రాజు తెలిపారు. ‘‘పట్టిసీమలో అవినీతి తవ్వడానికి గునపలు చాలవు. ఒక ట్రాక్టర్ మట్టి తీయడానికి 4 లక్షల తినేస్తున్నారు. పట్టిసీమ 1125 కోట్ల నుంచి మొదలై 1667 కోట్లకు వెళ్ళింది. 24 పంపులు వేసి, 30 పంపులకు లెక్కలు కట్టారు. టెండర్లలో లేనివాటికి కోట్లు కుమ్మరించారు. మట్టి పేరుతో 67 కోట్లు నొక్కేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ఒక్కో ఇంటికి రూ.20 వేలు వసూళ్లు చేస్తున్నారు. కొత్త   పింఛన్ కు మూడు నెలల డబ్బులు ముందే తీసుకుంటున్నారు. నీరుచెట్టు ఓ నాటకం. ఆఖరికి స్కూళ్లలో ఆడపిల్లల కోసం కట్టిన టాయిలెట్ల నిర్వహణలోనూ చంద్రబాబు అండ్‌ కో నిధులు నాకేస్తున్నారు’’ అని వీర్రాజు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement