లాభాల బాటలో ఇండియా సిమెంట్స్
► నికర లాభం రూ. 51 కోట్లకు
► మూడేళ్లలో రూ.350 కోట్ల పెట్టుబడులు
చెన్నై: ఇండియా సిమెంట్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.51 కోట్ల నికర లాభం (స్టాండోలోన్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) ఇదే క్వార్టర్‌కు రూ.37 కోట్ల నికర లాభం పొందామని ఇండియా సిమెంట్స్ తెలిపింది. మొత్తం ఆదాయం 2014-15 క్యూ4లో రూ.1,043 కోట్లని, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,154 కోట్లుగా ఉందని ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్, ఎండీ. ఎన్. శ్రీనివాసన్ చెప్పారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీని రద్దు చేసుకున్నందున గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలతో పోల్చడానికి లేదని పేర్కొన్నారు.