India Cements Company
-
ఇండియా సిమెంట్స్...
ఇండియా సిమెంట్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.5.07 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5.03 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఇండియా సిమెంట్స్ తెలిపింది. సిమెంట్ అమ్మకాలు తగ్గినా, వ్యయాలు తగ్గడం, రియలైజేషనన్లు మెరుగుపడటం వల్ల నిర్వహణ పనితీరు ఒకింత మెరుగుపడిందని కంపెనీ ఎమ్డీ ఎన్. శ్రీనివాసన్ పేర్కొన్నారు. కార్యకలాపాల ఆదాయం రూ.1,430 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,269 కోట్లకు తగ్గిందని తెలిపారు. మొత్తం వ్యయాలు రూ.1,439 కోట్ల నుంచి రూ.1,271 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. గత క్యూ2లో 30.77 లక్షల టన్నులుగా ఉన్న సిమెంట్, క్లింకర్ అమ్మకాలు ఈ క్యూ2లో 26.67 లక్షల టన్నులకు తగ్గాయని తెలిపారు. మధ్య ప్రదేశ్‌లో కొత్త ప్లాంట్... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో సిమెంట్‌కు డిమాండ్ బాగా తగ్గిందని, ఫలితంగా దక్షిణ భారత్‌లోనే డిమాండ్ తగ్గిందని శ్రీనివాసన్ వివరించారు. మధ్య ప్రదేశ్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో సిమెంట్‌కు డిమాండ్ పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీఎస్ఈలో ఇండియా సిమెంట్స్ షేర్ 1 శాతం నష్టంతో రూ.84 వద్ద ముగిసింది. -
ఇండియా సిమెంట్స్ లాభం రూ. 44 కోట్లు
చెన్నై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇండియా సిమెంట్స్ సంస్థ రూ. 44 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 35 కోట్లు. మరోవైపు ఆదాయం రూ. 1,402 కోట్ల నుంచి రూ. 1,581 కోట్లకు పెరిగింది. సిమెంటు అమ్మకాలు గణనీయంగా పెరగడం ఆర్థిక ఫలితాలు మెరుగుపడేందుకు తోడ్పడిందని సంస్థ వైస్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండో విడతలోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గృహ నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెంచడంపై మరింతగా దృష్టి సారించగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో సిమెంటుకు మంచి డిమాండ్ ఉండగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి–మార్చి మధ్యకాలంలో ప్లాంట్ల సామర్థ్య వినియోగం 79 శాతం నుంచి 84 శాతానికి పెరిగిందని శ్రీనివాసన్ ఈ సందర్భంగా చెప్పారు. జగన్ అభివృద్ధికి సానుకూలం..... మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారం దక్కించుకోవడంపై స్పందిస్తూ..‘జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అభివృద్ధికి సానుకూలంగా ఉంటారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సిమెంటుకు డిమాండ్ గణనీయంగా పెరగగలదని ఆశిస్తున్నా. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా సరైన ట్రాక్‌లో ఉంది. కచ్చితంగా అభివృద్ధికి అనుకూలంగానే ఉంటుందని, ఇన్ఫ్రా అభివృద్ధి, హౌసింగ్‌పై దృష్టి కొనసాగిస్తుందని భావిస్తున్నాను‘ అని శ్రీనివాసన్ తెలిపారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల కారణంగా తెలంగాణలో కూడా సిమెంటుకు మంచి డిమాండ్ ఉండగలదని భావిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతున్న సిమెంటు ధరలు సమీప భవిష్యత్‌లో స్థిరపడవచ్చని ఆయన పేర్కొన్నారు. -
లాభాల బాటలో ఇండియా సిమెంట్స్
► నికర లాభం రూ. 51 కోట్లకు ► మూడేళ్లలో రూ.350 కోట్ల పెట్టుబడులు చెన్నై: ఇండియా సిమెంట్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.51 కోట్ల నికర లాభం (స్టాండోలోన్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) ఇదే క్వార్టర్‌కు రూ.37 కోట్ల నికర లాభం పొందామని ఇండియా సిమెంట్స్ తెలిపింది. మొత్తం ఆదాయం 2014-15 క్యూ4లో రూ.1,043 కోట్లని, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,154 కోట్లుగా ఉందని ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్, ఎండీ. ఎన్. శ్రీనివాసన్ చెప్పారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీని రద్దు చేసుకున్నందున గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలతో పోల్చడానికి లేదని పేర్కొన్నారు.