పప్పుధాన్యాల దిగుమతికి మొజాంబిక్తో ఒప్పందం
భారతదేశంలో పప్పు ధాన్యాల ధరలు భగ్గుమంటుండటంతో.. వాటిని మొజాంబిక్ నుంచి దిగుమతి చేసుకోడానికి వీలుగా రెండు దేశాల మధ్య ఒక దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. దీంతో పాటు మొత్తం మూడు ఒప్పందాలు రెండు దేశాలకు కుదిరాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం నాలుగు ఆఫ్రికన్ దేశాల పర్యటనలో భాగంగా మొజాంబిక్లో ఉన్న విషయం తెలిసిందే.
ఆయన నేతృత్వంలో ఇరు దేశాల అధికారులు సమావేశమై, చర్చించుకున్న తర్వాత ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. క్రీడలు యువజన వ్యవహారాలలో సహకారం, డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, తదితర అంశాలపై కూడా ఒప్పందాలు కుదిరాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఉగ్రవాదమేనని, అందువల్ల రక్షణ రంగంలో ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
President Nyusi & I agreed to increase cooperation in vital areas like agriculture, food security & healthcare. https://t.co/deQYHQIhKI
— Narendra Modi (@narendramodi) 7 July 2016
Both of us agreed that terrorism is the gravest threat facing the world today. We have decided to strengthen defence & security ties.
— Narendra Modi (@narendramodi) 7 July 2016