pulses imports
-
పండగ సీజన్లో శనగపప్పు ధరలకు రెక్కలు
పండగ సీజన్‌కు ముందే పప్పుల ధరలు పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా వినియోగించే శనగపప్పుకు డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగిన సరఫరా లేకపోవడంతో గత నెల నుంచి వీటి ధరలు 10 శాతం పెరిగాయి. దాంతో సమీప భవిష్యత్తులో ఇంకెంత పెరుగుతుందోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.స్వీట్లు, లడ్డూలు, ఇతర వంటకాల తయారీలో శనగపప్పు అవసరం అవుతుంది. అయితే అంతకుముందు నెల వీటి ధరలు దాదాపు 5% పడిపోయాయి. దాంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. కానీ తాజా నివేదికల ప్రకారం ఇటీవల కాలంలో వీటి ధర 10 శాత పెరగడం మళ్లీ ఆందోళన కలిగిస్తుంది.ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్(ఐపీజీఏ) ప్రకారం..శనగపప్పుకు స్థిరమైన డిమాండ్ ఉంది. దేశీయంగా సరఫరా తగ్గింది. ప్రభుత్వం వద్ద పరిమిత స్టాక్ ఉంది. కానీ, రానున్న రోజుల్లో దిగుమతులు పెరుగుతాయి. దాంతో డిమాండ్‌ను అదుపుచేయవచ్చు. దానివల్ల ధరలు పెరగకుండా నియంత్రించవచ్చు. ప్రభుత్వం శనగపప్పు ధరలు పెరుగుతాయని ముందే ఊహించి పసుపు బఠానీలను భారీగా దిగుమతి చేసుకుంది. కానీ ఆశించిన విధంగా శనగపప్పు డిమాండ్‌ను భర్తీ చేయలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థఇదిలాఉండగా, సెప్టెంబరు నాటికి ఆఫ్రికా, ఆస్ట్రేలియాల నుంచి శనగపప్పు దిగుమతులు పెరగడం వల్ల ధరలు మరింత పెరగకుండా నిరోధించవచ్చని కొందరు వ్యాపారులు తెలిపారు. పసుపు బఠానీలను ఎలాంటి సుంకం లేకుండా దిగుమతి చేసుకునేలా అనుమతులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ధరలు అదుపులో ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వాతావరణ సమస్యలు, ఆఫ్రికా సరఫరాలో జాప్యం, పండగ సీజన్, రాష్ట్ర ప్రభుత్వ కొనుగోళ్లకు అనుమతులు ఇవ్వడం వంటి కారణాలతో రానున్న రోజుల్లో కంది పప్పు ధరలు కూడా పెరుగుతాయిని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
పెరుగుతున్న దిగుమతులు.. ధరలకు రెక్కలు!
రైతులకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ దేశీయ పప్పుల అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పప్పుల దిగుమతులు 2023-24లో గతంలోకంటే దాదాపు రెండింతలు పెరిగి 3.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల టన్నుల పప్పు దినుసులు ఎగుమతి చేసుకున్నట్లు అంచనా. ఇది అంతకుమందు ఏడాదిలో 24.5 లక్షల టన్నులుగా ఉంది. దేశీయంగా పప్పు ధరలను నియంత్రణలో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా పప్పు దినుసుల దిగుమతుల కోసం బ్రెజిల్, అర్జెంటీనాలతో ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిసింది. చర్చలు సఫలమైతే బ్రెజిల్ నుంచి మినుములు, అర్జెంటీనా నుంచి కందులను దిగుమతి చేసుకోనుంది. పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఇప్పటికే మొజాంబిక్, టాంజానియా, మయన్మార్‌లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం పసుపు బఠానీల దిగుమతిపై ఈ ఏడాది జూన్ వరకు సుంకాన్ని వసులు చేయకూడదని నిర్ణయించింది. ఇప్పటికే మినుములు, కందుల దిగుమతులకు ఈ నిబంధన వర్తిస్తోంది. మార్చి 31, 2025 వరకు వీటిని సుంకం లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని ప్రభుత్వ తెలిపింది. ఎన్నికల సమయంలో ఆందోళన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పప్పుల ధరల ద్రవ్యోల్బణం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే విధంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం మార్చిలో 17 శాతం నమోదైంది. దాంతో గత కొంతకాలంగా పప్పు ధరలు పెరుగుతున్నాయి. వాటిని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 15న పప్పు నిల్వలపై పరిమితులను విధించింది. ఇదీ చదవండి: ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లు ప్రారంభించిన ప్రముఖ కంపెనీ ప్రభుత్వం గ్యారెంటీ కొనుగోలు, ఎంఎస్పీ వంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ దేశీయంగా గత కొంతకాలంగా ఉత్పత్తి క్షీణిస్తోంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం 2023-24లో పప్పుధాన్యాల ఉత్పత్తి 234 లక్షల టన్నులుగా ఉంది. అంతకుమందు ఏడాది 261 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. -
అపరాల దిగుమతులపై ఆంక్షల ఎత్తివేత
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం దిగుమతి విధానాన్ని సడలించడంతో అందరికీ పప్పు ధాన్యాలు ప్రత్యేకించి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్లుగా ఇవి ఆంక్షల జాబితాలో ఉండడంతో దిగుమతి చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుత కరోనా సమయంలో అందరికీ పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ మూడు పప్పుధాన్యాలను ఓపెన్ క్యాటగిరీలో చేర్చి దిగుమతికి అనుమతించినట్టు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రకటించింది. ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజలను కాపాడడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. ఆంక్షల తొలగింపు గడువు అక్టోబర్ 31 వరకే ఉండడంతో వ్యాపారులు వెంటనే రంగంలోకి దిగారు. రెండున్నర లక్షల టన్నుల కంది, ఒకటిన్నర లక్షల టన్నుల మినుము, 50–75 వేల టన్నుల పెసరపప్పును మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు. గతేడాది పంటల కాలంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండడం, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని నాఫెడ్ (జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య) వద్ద బఫర్ నిల్వలు తరిగిపోవడం వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం దిగుమతులకు అనుమతించింది. మీ దగ్గరున్న నిల్వలెంతో చెప్పండి.. నిత్యావసర వస్తువులు ప్రత్యేకించి పప్పుధాన్యాల నిల్వలు, వాటి ధరలు ఎంతెంత ఉన్నాయో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. కొన్ని పప్పుల ధరలు భారీగా పెరగడంతో కేంద్రం రాష్ట్రాలకు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఎవరెవరి వద్ద ఎన్నెన్ని నిల్వలున్నాయో తేలనుంది. ధర పెరుగుతుందని కొంతమంది బడా వ్యాపారులు సరకును దాస్తుంటారు. ఇప్పుడా లెక్కలు కూడా తేలతాయని మార్కెటింగ్ శాఖాధికారి ఒకరు తెలిపారు. తక్కువ ధరకు అమ్ముకోవద్దు.. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల హెక్టార్లు, రబీలో 23.74 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తులన్నింటికీ కనీస మద్దతు ధర లభించింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రబీలో అపరాల సాగు బాగా పెరిగింది. ఇప్పుడిప్పుడే పంట దిగుబడి చేతికి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు కనీస మద్దతు ధర కంటే ఎక్కువగానే తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉంది. పప్పు ధాన్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించినందున రైతులు ఈసారి గిట్టుబాటు ధరలకు అపరాలను అమ్ముకోవచ్చునని, దళారుల మాట విని తక్కువ ధరలకు అమ్ముకోవద్దని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సూచించారు. -
పప్పు రైతులపై దిగుమతుల పిడుగు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల నుంచి పప్పు దినుసులను దిగుమతి చేసుకోవడానికి దేశంలోని రిజస్టరైన పప్పు దినుసుల వ్యాపారులు, మిల్లర్లు జూన్ ఒకటవ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటోంది. ఈ మేరకు మే 16వ తేదీనే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ‘దేశీయంగానే పప్పు దినుసుల దిగుమతి దండిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి దిగుమతి ఎందుకు, దండగ! అని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ముందుగానే ప్రశ్నించాం. అయితే ప్రపంచ వాణిజ్య సంస్థ నియమ నిబంధనల ప్రకారం విదేశాల నుంచి పప్పు దినుసులను దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో ఊరుకున్నాం’ అని అఖిల భారత పప్పు మిల్లుల సంఘం చైర్మన్ సురేశ్ అగర్వాల్ తెలిపారు. తాము ఈ విషయమైన మే ఆరవ తేదీనే కేంద్ర వాణిజ్య శాఖను కలిసి చర్చలు జరిపినట్లు ఆయన వివరించారు. పప్పు దినుసులను శుద్ధి చేసే సామర్థ్యాన్నిబట్టి మిల్లుల యజమానులు విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, ఎవరికి ఎంత దిగుమతి కోటా కావాలో స్పష్టంగా తెలియజేస్తూ జూన్ ఒకటవ తేదీ నుంచి కేంద్ర వాణిజ్య విభాగానికి దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన కోటా తక్కువనా, లేక మిల్లర్ కోట్ చేసినది తక్కువనా ? అన్న అంశం ఆధారంగా తక్కువనే ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం దిగుమతుల కేటాయింపులను ఖరారు చేస్తుంది. ఆగస్టు 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ దిగుమతుల వల్ల రైతులు నష్టపోతారా లేక మిల్లర్ నష్టపోతారా? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. పప్పు దినుసుల్లో, వాటి వినియోగంలో భారత్ ప్రపంచంలోనే పెద్ద దేశం. మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు మిల్లర్లు పప్పు దినుసులు కొనగోలు చేసి వాటిని నిల్వ చేస్తారు. తద్వారా ధర పెరిగినప్పుడు అమ్ముకుంటారు. దేశంలో ఉత్పత్తి పెరిగినా, తగ్గినా, విదేశాల నుంచి పప్పుదినుసుల దిగుమతి పెరిగినా, తగ్గినా వ్యాపారులకు, మిల్లర్లకు వచ్చే నష్టం పెద్దగా ఎప్పుడూ ఉండదు. నష్టపోయేది ఎక్కువగా ఎప్పుడూ రైతులే. పప్పుదినుసులు ఎక్కువ పండించినప్పుడు వాటిని నిల్వచేసుకునే సామర్థ్యం వారికి ఎక్కువ ఉండదు. అందుకు అవసరమైన శీతల గిడ్డంగులు వారికి అందుబాటులో ఉండవు. ఇటు రైతుకు, అటు వినియోగదారులకు భారం కాకుండా ధరలు హేతుబద్ధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే కేంద్రం 23 వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. మార్కెట్లో రైతుకు కనీస మద్దతు ధర లభించనప్పుడు ఆ సరకు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కేవలం బియ్యం, గోధుమల కొనుగోలుకే ప్రభుత్వం ఎక్కువగా పరిమితం అవుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. 2016లో తూర్పు ఆఫ్రికాలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడి దేశాలతో ఒప్పందం చేసుకోవడం వల్ల కెన్యా, టాంజానియా దేశాల నుంచి 2017లో భారీ ఎత్తున పప్పు దినుసులు భారత్‌కు దిగుమతి చేసుకోవడం వల్ల గిట్టుబాటు ధర తగ్గి పప్పుదినుసుల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని లక్షల టన్నుల పప్పు దినుసులకు కొనుగోలుదారులు లేకుండా పోయారు. భారత్‌తో ఒప్పందం కారణంగా పలు తూర్పు ఆఫ్రికా దేశాల రైతులు ఈసారి తమ పప్పు దినుసుల సాగును మరింత విస్తీర్ణం చేశారు. భారత్‌తో అవగాహనా రాహిత్యం వల్ల తమ దేశంలో కూడా 20 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు దినుసలకు బయ్యర్లు లేకుండా పోయారని కెన్యాలోని కిటూ కౌంటీ గవర్నర్ చారిటీ కలుకి మీడియాకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి కూడా భారత్ పప్పు దినుసులను దిగుమతి చేసుకుంటే భారతీయ రైతులు మరింత నష్టపోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పప్పుధాన్యాల దిగుమతికి మొజాంబిక్‌తో ఒప్పందం
భారతదేశంలో పప్పు ధాన్యాల ధరలు భగ్గుమంటుండటంతో.. వాటిని మొజాంబిక్ నుంచి దిగుమతి చేసుకోడానికి వీలుగా రెండు దేశాల మధ్య ఒక దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. దీంతో పాటు మొత్తం మూడు ఒప్పందాలు రెండు దేశాలకు కుదిరాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం నాలుగు ఆఫ్రికన్ దేశాల పర్యటనలో భాగంగా మొజాంబిక్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన నేతృత్వంలో ఇరు దేశాల అధికారులు సమావేశమై, చర్చించుకున్న తర్వాత ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. క్రీడలు యువజన వ్యవహారాలలో సహకారం, డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, తదితర అంశాలపై కూడా ఒప్పందాలు కుదిరాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఉగ్రవాదమేనని, అందువల్ల రక్షణ రంగంలో ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. President Nyusi & I agreed to increase cooperation in vital areas like agriculture, food security & healthcare. https://t.co/deQYHQIhKI — Narendra Modi (@narendramodi) 7 July 2016 Both of us agreed that terrorism is the gravest threat facing the world today. We have decided to strengthen defence & security ties. — Narendra Modi (@narendramodi) 7 July 2016