మార్కెట్లకు మళ్లీ భారీ లాభాల కళ
భారతీయ స్టాక్ మార్కెట్లకు మళ్లీ భారీ లాభాల కళ వచ్చేసింది. గురువారం నాడు ప్రారంభమే మంచి లాభాల సెంటిమెంటుతో మొదలైన మార్కెట్లు.. అదే ట్రెండును మధ్యాహ్నం వరకు కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 516 పాయింట్లు లాభపడి 26,231 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 157 పాయింట్లు లాభపడి 7,949 వద్ద ముగిసింది.
హెపటైటిస్ బి నివారణకోసం అరబిందో ఫార్మా తయారుచేసిన మందుకు అమెరికా ఎఫ్డీఏ నుంచి అనుమతి రావడంతో ఆ షేరు ధర 3.7 శాతం పెరిగింది. దాదాపు ఇదే ట్రెండు చాలావరకు షేర్లలో కనిపించింది. యూరోపియన్ మార్కెట్లు కూడా ర్యాలీ చేయడంతో.. భారతీయ మార్కెట్లు కూడా దానికి తగ్గట్లే స్పందించాయి. ప్రధానంగా హెచ్డీఎఫ్సీ, వేదాంత, సిప్లా, లూపిన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు బాగా లాభపడ్డాయి. అయితే, బీహెచ్ఈఎల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, హిందాల్కో, హీరో మోటోకార్ప్ మాత్రం కొంతమేర నష్టాలు చవిచూశాయి.