హూస్టన్ పీడబ్ల్యూఈ సారథిగా తెలుగు తేజం!
హూస్టన్: టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగర ప్రజాపనులు, ఇంజినీరింగ్(పీడబ్ల్యూఈ) సారథిగా ఇండోఅమెరికన్ ఇంజినీర్ కరుణ్ శ్రీరామ(53) ఎంపికయ్యారు. నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఆయన పేరును ప్రతిపాదించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, యూనివర్సిటీ ఆఫ్ రూర్కీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అమెరికాకు చేరుకున్నాక యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ రోల్లాలో సివిల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.
మేయర్ నిర్ణయానికి కౌన్సిల్ ఆమోదం తెలిపితే ఏప్రిల్ 3న శ్రీరామ బాధ్యతలు చేపట్టనున్నారు. కరుణ్ శ్రీరామ మాట్లాడుతూ ప్రజాపనుల శాఖను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళతామన్నారు. అందుకోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.