Indian-American engineer
-
హూస్టన్ పీడబ్ల్యూఈ సారథిగా తెలుగు తేజం!
హూస్టన్: టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగర ప్రజాపనులు, ఇంజినీరింగ్(పీడబ్ల్యూఈ) సారథిగా ఇండోఅమెరికన్ ఇంజినీర్ కరుణ్ శ్రీరామ(53) ఎంపికయ్యారు. నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఆయన పేరును ప్రతిపాదించారు. హైదరాబాద్కు చెందిన శ్రీరామ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, యూనివర్సిటీ ఆఫ్ రూర్కీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అమెరికాకు చేరుకున్నాక యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ రోల్లాలో సివిల్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. మేయర్ నిర్ణయానికి కౌన్సిల్ ఆమోదం తెలిపితే ఏప్రిల్ 3న శ్రీరామ బాధ్యతలు చేపట్టనున్నారు. కరుణ్ శ్రీరామ మాట్లాడుతూ ప్రజాపనుల శాఖను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళతామన్నారు. అందుకోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. -
భారతీయ ఇంజినీర్ కు అమెరికాలో అరుదైన హోదా
వాషింగ్టన్: వైట్ హౌస్ లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి ఉన్నత స్థానం దక్కింది. పాలనలో అతి ముఖ్యమైన సలహా కమిటీలో ఇంజినీర్ మంజీత్ సింగ్ ను సభ్యుడిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. మంజీత్ సింగ్ అమెరికాలో సిక్కుల హక్కులు, ఎడ్యూకేషన్ ఫండ్ సంస్థ సహవ్యవస్థాపకుడు. గురువారం జరిగిన ఈ నియామకంపై వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇతర దేశాలతో సంబంధాలను మెరుగుపరచడంతో నూతనంగా ఎన్నికైన వారు మరింత కృషి చేయాలని ఒబామా సూచించారు. గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మాస్టర్ సైన్స్ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో ఆయన ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2013లో మంజీత్ సింగ్ ఓ స్టాఫ్ట్ వేర్ సంస్థను స్థాపించి తన సేవలను మరింత విస్తృతం చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా అమెరికా అధ్యక్షుడి పరిపాలన విభాగంలో ఉన్నత హోదా దక్కించుకున్నారు.