భారతీయ ఇంజినీర్ కు అమెరికాలో అరుదైన హోదా
వాషింగ్టన్: వైట్ హౌస్ లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి ఉన్నత స్థానం దక్కింది. పాలనలో అతి ముఖ్యమైన సలహా కమిటీలో ఇంజినీర్ మంజీత్ సింగ్ ను సభ్యుడిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. మంజీత్ సింగ్ అమెరికాలో సిక్కుల హక్కులు, ఎడ్యూకేషన్ ఫండ్ సంస్థ సహవ్యవస్థాపకుడు. గురువారం జరిగిన ఈ నియామకంపై వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇతర దేశాలతో సంబంధాలను మెరుగుపరచడంతో నూతనంగా ఎన్నికైన వారు మరింత కృషి చేయాలని ఒబామా సూచించారు.
గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి మాస్టర్ సైన్స్ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో ఆయన ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2013లో మంజీత్ సింగ్ ఓ స్టాఫ్ట్ వేర్ సంస్థను స్థాపించి తన సేవలను మరింత విస్తృతం చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా అమెరికా అధ్యక్షుడి పరిపాలన విభాగంలో ఉన్నత హోదా దక్కించుకున్నారు.